Shaakuntalam- Allu Arha: శాకుంతలం మూవీ: అల్లు అర్హ పెర్ఫార్మన్స్ పై ఆడియన్స్ షాకింగ్ రియాక్షన్… తండ్రి పరువు!

Shaakuntalam- Allu Arha: శాకుంతలం మూవీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అత్యంత ప్రత్యేకంగా మారింది. దీనికి ఓ కారణం ఉంది. ఆయన వారసురాలు అర్హ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. శాకుంతలం మూవీలో ఆమె సమంత కొడుకుగా నటించింది. హిందూ పురాణాల్లో భరతుడికి వీరుడిగా పేరుంది. శకుంతల-దుష్యంతుడు కుమారుడే ఈ భరతుడు. శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేసింది. అర్హ పసిప్రాయంలోనే గొప్ప నటన కనబరిచిందని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ […]

  • Written By: Shiva
  • Published On:
Shaakuntalam- Allu Arha: శాకుంతలం మూవీ: అల్లు అర్హ పెర్ఫార్మన్స్ పై ఆడియన్స్ షాకింగ్ రియాక్షన్… తండ్రి పరువు!
Shaakuntalam- Allu Arha

Shaakuntalam- Allu Arha

Shaakuntalam- Allu Arha: శాకుంతలం మూవీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అత్యంత ప్రత్యేకంగా మారింది. దీనికి ఓ కారణం ఉంది. ఆయన వారసురాలు అర్హ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. శాకుంతలం మూవీలో ఆమె సమంత కొడుకుగా నటించింది. హిందూ పురాణాల్లో భరతుడికి వీరుడిగా పేరుంది. శకుంతల-దుష్యంతుడు కుమారుడే ఈ భరతుడు. శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేసింది. అర్హ పసిప్రాయంలోనే గొప్ప నటన కనబరిచిందని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సమయంలో కొనియాడారు.

అల్లు అర్హకు ఒక్క ఇంగ్లీషు పదం రాదు. ఈ జనరేషన్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడకపోవడం చూసి నేను షాక్ అయ్యాయని దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. ఆమె తెలుగు డైలాగ్స్ స్పష్టంగా పలికిందని ప్రశంసించారు. సమంత సైతం అల్లు అర్హ టాలెంట్ కి సర్ప్రైజ్ అయ్యారట. వందల మంది మధ్య అర్హ ఎలాంటి బెరుకు లేకుండా అల్లు అర్హ నటించిందని సమంత తెలియజేశారు. అర్హకు పూర్తిగా తెలుగు వచ్చని సమంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Shaakuntalam- Allu Arha

Shaakuntalam- Allu Arha

సినిమాలో చివరి పదిహేను నిమిషాలు అల్లు అర్హ పాత్ర ఉంటుంది. అది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని దర్శక నిర్మాతలు వెల్లడించారు. చిత్ర యూనిట్ అల్లు అర్హ పాత్ర గురించి ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో ఆమె పాత్ర మీద ఆసక్తి కలిగింది. అల్లు అర్హ ఎలా నటించారో చూడాలనే ఉత్సుకత ఏర్పడింది.

శాకుంతలం నేడు విడుదల కాగా సస్పెన్సు కి తెరపడింది. అల్లు అర్హ ఎంట్రీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. ఇక యూనిట్ చెప్పినట్లు అల్లు అర్హ పాత్ర పతాక సన్నివేశాలకు ముందు వస్తుంది. ఇది సినిమాకు హైలెట్ అంటున్నారు. అల్లు అర్హ ఎంట్రీతో పతాక సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. ఆమె సినిమాకు ప్లస్ అయిందంటున్నారు. తండ్రికి తగ్గ కూతురిగా తగ్గేదేలే అన్నట్లు నటించిందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

అల్లు అర్హ నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. ఆమె భవిష్యత్తులో మంచి నటి అవుతుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక అల్లు అర్జున్ కూతురు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం విశేషం. లిటిల్ ప్రిన్సెస్ అర్హ మిమ్మల్ని మెప్పిస్తుందని ఆశిస్తున్నాము. దర్శకుడు గుణశేఖర్ కి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్ మూవీకి ప్రచారం కల్పించనుంది. మొత్తంగా అల్లు అర్హ తండ్రి పేరు నిలబెట్టింది అంటున్నారు…

https://twitter.com/search?q=%23alluarha&src=typed_query&f=live

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు