Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్ లతో బాగా సఫర్ అవుతున్నాడు. అందుకే, 2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత షారుఖ్ మళ్ళీ మరో సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు. అయితే, గత ఏడాది ఓ సినిమా స్టార్ట్ చేసినా కరోనా కారణంగా షారుఖ్ నుంచి ఆ సినిమా విడుదల కాలేదు. ఇంతలో కరోనా ఎఫెక్ట్ తో పాటు డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఆర్యన్ అరెస్ట్ వ్యవహారం కూడా షారుఖ్ ను బాగా బాధ పెట్టాయి.

Shah Rukh Khan
అసలుకే నెంబర్ వన్ పొజిషన్ పోయింది అని షారుఖ్ ఫీల్ అవుతుంటే.. ఆర్యన్ కేసు ఓ దశలో షారుఖ్ కి కన్నీళ్లు తెప్పించింది. అయితే, రాజకీయ అండతో మొత్తానికి డ్రగ్స్ కేసు నుంచి తన కుమారుడిని బయట పడేసుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ హ్యాపీగానే ఉన్నాడు. అందుకే, సినిమాల పై దృష్టి పెట్టాడు. అయితే, ఈ బాలీవుడ్ స్టార్ హీరో ఒక సౌత్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని అసలు ఎవరూ ఊహించలేదు.
కానీ, షారుఖ్ సౌత్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న షారుఖ్ సడెన్ గా నేడు షూట్ కోసం సెట్ కి వెళ్ళాడు. అట్లీ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం షారుఖ్ ముంబైలోని సెట్స్ లోకి అడుగుపెట్టి చాలా ఉత్సాహంగా కనిపించాడు.
Also Read: వీడియోతో ఓ ఊపు ఊపేస్తున్న రష్మిక !
అలాగే తన మరో సినిమా ‘పఠాన్’ సినిమా షూటింగ్‌లోనూ ఇక నుంచి రెగ్యులర్‌గా పాల్గొననున్నారని తెలుస్తోంది. మొత్తానికి షారుఖ్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా మారబోతున్నాడు అన్నమాట. షారుఖ్ కి హిట్ లేకపోయినా నేటికీ బాలీవుడ్ బాద్‌షా అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తుకువస్తారు. అందుకే, అట్లీ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
ఇక అట్లీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో సౌత్ ఇండియా నటీనటులనే సెలెక్ట్ చేశాడు. మొదట నిర్మాతలు, ఈ సినిమాలో హీరోయిన్ గా విద్యాబాలన్ తీసుకోవాలనుకున్నారు. కానీ, అట్లీ మాత్రం షారుఖ్ ను ఒప్పించి నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. షారుఖ్ కూడా అట్లీ ఏది చెబితే అదే చేద్దాం అనే మూడ్ లో ఉన్నాడట. వరుస బాధల అనంతరం షారుఖ్ ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు.
Also Read: ‘లైగర్’ భామ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!