Shah Rukh Khan- Nayanthara: నయనతార తో సముద్రం లో రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కిన షారుఖ్ ఖాన్
Shah Rukh Khan- Nayanthara: సంక్షోభం లో ఉన్న బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి అక్కడి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి మళ్ళీ బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. హిందీ సినిమాలకు ఇండియన్ మార్కెట్ తో పాటుగా ఓవర్సీస్ మార్కెట్ ని కూడా సెట్ చేసాడు, ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ తో ‘జవాన్’ అనే సినిమా […]


Shah Rukh Khan- Nayanthara
Shah Rukh Khan- Nayanthara: సంక్షోభం లో ఉన్న బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి అక్కడి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి మళ్ళీ బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. హిందీ సినిమాలకు ఇండియన్ మార్కెట్ తో పాటుగా ఓవర్సీస్ మార్కెట్ ని కూడా సెట్ చేసాడు, ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ తో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు.
సౌత్ ఇండియన్ మార్కెట్ పై ఎప్పటి నుండో కన్నేసిన షారుఖ్ ఖాన్, ఈ చిత్రం తో ఎలా అయినా ఇక్కడి మార్కెట్ సంపాదించాలనే అట్లీ తో సినిమాని కుదిరించుకున్నాడు. అంతే కాదు ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర కోసం సౌత్ ఇండియన్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్ , విజయ్ మరియు రామ్ చరణ్ లను అడిగారు.రామ్ చరణ్ ఆ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడని త్వరలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని వార్తలు వచ్చాయి.
ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ప్రస్తుతానికి తెలియదు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే, ఫ్లాష్ బ్యాక్ లో ఈమె పాత్ర వస్తుందట. ప్రస్తుతం ముంబై బీచ్ లో వీళ్లిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట.

Shah Rukh Khan- Nayanthara
ఈమధ్య కాలం లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తూ వచ్చిన నయనతార, ఇలా రొమాంటిక్ సాంగ్ లేదా , రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం విశేషం. మరి మన సౌత్ ఆడియన్స్ దీనిని ఎలా తీసుకుంటారో చూడాలి.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి మూవీ పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ఈ చిత్రం తో షారుఖ్ ఖాన్ మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.
