Shah Rukh Khan Jawan: భారీ ధరకు షారుక్ జవాన్ థియేట్రికల్ రైట్స్… ఏంది సామీ ఈ క్రేజ్!

కొంచెం గ్యాప్ తీసుకుని పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ వసూళ్ల వర్షం కురిపించింది. షారుక్ హిట్ దాహం తీర్చింది. ఆయన మార్కెట్ స్టామినా ఏమిటో నిరూపించింది. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఈ

  • Written By: Shiva
  • Published On:
Shah Rukh Khan Jawan: భారీ ధరకు షారుక్ జవాన్ థియేట్రికల్ రైట్స్… ఏంది సామీ ఈ క్రేజ్!

Shah Rukh Khan Jawan: 90లలో షారుక్ ఖాన్ బాలీవుడ్ కింగ్ గా అవతరించారు. ఖాన్ త్రయం హిందీ పరిశ్రమను ఏలుతుండగా… వారిలో షారుక్ దే అగ్రస్థానం. ఒక దశకు వచ్చాక అమీర్ ఖాన్ పై చేయి సాధించాడు. లగాన్, త్రీ ఇడియట్స్, దంగల్ చిత్రాలతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. దంగల్ వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు షారుక్ ఖాన్ ని వరుస పరాజయాలు వెంటాడాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ అనంతరం షారుక్ ఖాన్ కి హిట్ పడలేదు. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. అయినా ఫలితం రాలేదు.

కొంచెం గ్యాప్ తీసుకుని పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ వసూళ్ల వర్షం కురిపించింది. షారుక్ హిట్ దాహం తీర్చింది. ఆయన మార్కెట్ స్టామినా ఏమిటో నిరూపించింది. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.

వ్యతిరేకత మధ్య విడుదలైన పఠాన్ విజయం అందుకుంది. పఠాన్ సక్సెస్ నేపథ్యంలో షారుక్ అప్ కమింగ్ చిత్రాలపై హైప్ ఏర్పడింది. బయ్యర్లు ఆయన చిత్రాల కోసం పోటీపడుతున్నారు. దీంతో జవాన్ మూవీ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని సమాచారం.వరల్డ్ వైడ్ జవాన్ రైట్స్ రూ. 250 కోట్లకు అమ్మారని సమాచారం. థియేట్రికల్ రైట్స్ అన్ని వందల కోట్లు అంటే మాటలు కాదు. జవాన్ చిత్ర బడ్జెట్ కి అది సమానం. ఇంకా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి.

విడుదలకు ముందే జవాన్ భారీ లాభాలు అందుకోనుంది. జవాన్ చిత్రానికి అట్లీ దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీలో షారుక్ కి జంటగా నయనతార నటిస్తుంది. హీరోయిన్ ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. అట్లీ బాలీవుడ్ లో ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి. కోలీవుడ్ లో ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్నాడు. హీరో విజయ్ కి తేరి, మెర్సల్, బిగిల్ వంటి హిట్స్ ఇచ్చాడు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube