Tollywood Sequels: సినిమా అంటే రంగుల ప్రపంచం. కోట్ల రూపాయల వ్యాపారం. సినిమా ప్రేక్షకుడికి నచ్చితే పెట్టిన పెట్టుబడి తో పాటు రెట్టించిన స్థాయిలో లాభాలు వస్తాయి.. అదే నచ్చుకుంటే అదే స్థాయిలో అప్పలు మిగులుతాయి. ఎంత తోపు ఇండస్ట్రీ అయినప్పటికీ విజయాల శాతం 5కు మించదు. ఇప్పుడు వెనుకటి రోజులు కావు. పైగా సినిమా విస్తృతి పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే విజయవంతమైన సినిమాలకు కొనసాగింపు ప్రారంభిస్తున్నారు.

Tollywood Sequels
రాజమౌళి ప్రారంభించారు
తెలుగు సినిమా స్థాయిని పెంచింది బాహుబలి.. బాహుబలి 2 అంతకుమించి విజయం సాధించింది. వీటి రూపశిల్పి ఎస్ఎస్ రాజమౌళి.. ఆ తర్వాత తీసిన ఆర్ఆర్ఆర్.. బాహుబలి స్థాయిలో లేకపోయినప్పటికీ భారీగానే వసూళ్ళు సాధించింది. ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. వాస్తవానికి బాహుబలి 1,2 తో రాజమౌళి ఆపేసాడు గాని… వాటిని కొనసాగించి ఉంటే మహాభారతం అంత ఎపిక్ అయ్యుండేది.. ప్రభాస్, అనుష్క తర్వాత మరో జంటను పరిచయం చేయడమో, అడవి శేష్ పాత్ర బ్యాక్ స్టోరీ చెప్పడమో, అస్లాం ఖాన్ కథని చెప్పడమో… అలా చేసి ఉంటే కాశి మజిలీ కథ లాగే బాహుబలి సాగిపోతూ ఉండేది.. బాహుబలి సిరీస్ తర్వాత జనాలకు బాగా నచ్చింది “దృశ్యం.” ఈ సినిమా బాహుబలి కంటే ముందే వచ్చింది. క్రైమ్, సస్పెన్స్ తో మిలితమైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. విడుదలైన అన్ని భాషల్లోనూ విజయా డంకా మోగించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్, శ్రేయ,టబు ప్రధాన పాత్రల్లో రీమేక్ అయిన దృశ్యం _2 కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 50 కోట్లు పెట్టి తీస్తే 270 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ ఏటి మేటి కమర్షియల్ చిత్రంగా దూసుకుపోతున్నది. ఈ ప్రకారం దృశ్యం_3,4 కూడా తీసుకుంటూ పోవచ్చు.. అలాగే కేజిఎఫ్ సిరీస్ కూడా… ఇప్పటికి రెండు పూర్తయ్యాయి. మూడోది లైన్ లో ఉంది. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ హింట్ కూడా ఇచ్చారు.
హిట్ ఏకంగా 7 సీరిస్ లు
హాలీవుడ్ లో మార్వెల్ సినిమాలు సిరీస్ మాదిరిగా వస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న హిట్ _2 ఏడు సీరిస్ లుగా రాబోతోంది. మూడో పార్ట్ లో అర్జున్ సర్కార్ అనే పాత్రలో హీరో నాని నటించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి డైరెక్టర్ శైలేష్ కొలను హింట్ కూడా ఇచ్చాడు. కార్తికేయ కూడా ఒకటి, రెండు భాగాలు విజయవంతమయ్యాయి.. మూడో భాగం లైన్ లో ఉంది.. కార్తికేయ _2 ఎండింగ్ లో దానికి సంబంధించి చిన్న క్లూ ఇచ్చారు. అలాగే బింబిసార కూడా కొనసాగింపుగా వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Tollywood Sequels
పెద్ద సినిమాలు కూడా
మీడియం బడ్జెట్ సినిమాలే కాకుండా… భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈ ఏడాది కొనసాగింపుగా వచ్చేందుకు అవకాశం ఉంది.. పుష్ప_2, పొన్నియన్ సెల్వన్_2, డీజే టిల్లు_2 కూడా ఈ ఏడాదిలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇక శాండల్ వుడ్ తాజా సంచలనం కాంతారా రెండో భాగం కూడా వచ్చే అవకాశం ఉంది.. ఈ సినిమా చివర్లో హీరోయిన్ గర్భం పై కెమెరా ప్యాన్ చేశారు కాబట్టి… తర్వాతి వారసుడితో కథ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.. ఒకప్పుడు సీక్వెల్ సంస్కృతి భారతీయ సినీ పరిశ్రమలో ఉండేది కాదు. కానీ కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఓటిటి సౌకర్యం పెరిగాక విభిన్నమైన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే దర్శకులు కూడా తమ సినిమా కథలను మార్చుతున్నారు.. అందులో నుంచి వస్తున్నవే ఈ కొనసాగింపు కథలు. సీక్వెల్ సినిమాలంటే హాలీవుడ్ గురించే అందరూ చెబుతారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్ కూడా చేరింది.