Project K: అభిమానులు ఇక కాస్కోండి..నేడు రాత్రి 7 గంటలకు ప్రాజెక్ట్ K నుండి సెన్సేషనల్ అప్డేట్!

నేడు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అసలు ప్రాజెక్ట్ K లో K అంటే ఏమిటి అనే విషయం తెలియనుంది. అమెరికా లోని ప్రఖ్యాత ‘కామిక్ కాన్’ లో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని విడుదల చెయ్యనున్నారు. నేడు రాత్రి 7 గంటలకు అధికారికంగా టైటిల్ ని ప్రకటించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

  • Written By: Vicky
  • Published On:
Project K: అభిమానులు ఇక కాస్కోండి..నేడు రాత్రి 7 గంటలకు ప్రాజెక్ట్ K నుండి సెన్సేషనల్ అప్డేట్!

Project K: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. సైన్స్ ఫిక్షన్ మరియు మన పురాణాలను మిక్స్ చేస్తూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అసలు ప్రాజెక్ట్ K అంటే ఏమిటి?, అసలు ఈ సినిమా స్టోరీ ఏమిటి అనేదానిపై చాలా మంది అభిమానుల్లో క్లారిటీ లేదు.

మహాభారతం కాలం నాటి అశ్వద్దామా, నేటి తరం లోకి అడుగుపెట్టడం, కురుక్షేత్రం లో తనవల్ల జరిగిన తప్పిదాలను సరి చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్లి సరిచేసుకోవాలని అనుకోవడం, అందుకే టైం ట్రావెల్ ని ఉపయోగించుకోవడం ఇలా ఈ సినిమా కథ ఉంటుందని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ప్రచారం సాగుతుంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది నేడు రాత్రి తేలనుంది.

నేడు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అసలు ప్రాజెక్ట్ K లో K అంటే ఏమిటి అనే విషయం తెలియనుంది. అమెరికా లోని ప్రఖ్యాత ‘కామిక్ కాన్’ లో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని విడుదల చెయ్యనున్నారు. నేడు రాత్రి 7 గంటలకు అధికారికంగా టైటిల్ ని ప్రకటించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

దీపికా పదుకొనే మరియు దిషా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ కూడా ఈ చిత్రం భాగం అయ్యాడు. ఇందులో ఆయన విలన్ గా నటించబోతున్నట్టు సమాచారం. వచ్చే నెల నుండి ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు