Ravanasura OTT : ‘రావణాసుర’కి ఓటీటీ లో సెన్సషనల్ రెస్పాన్స్..ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా!

అమెజాన్ ప్రైమ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. కేవలం కుర్రాళ్ళు మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

  • Written By: NARESH
  • Published On:
Ravanasura OTT : ‘రావణాసుర’కి ఓటీటీ లో సెన్సషనల్ రెస్పాన్స్..ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా!

Ravanasura OTT : కొన్ని సినిమాలు థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అవుతాయి, కానీ టీవీ టెలికాస్ట్ మరియు ఓటీటీ లో వచ్చినప్పుడు ఇంత మంచి సినిమా ఎలా ఫ్లాప్ అయ్యింది రా బాబు అని అనుకుంటుంటాము, అలాంటి సినిమాలలో ఒకటి మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’. ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ చేసిన చిత్రం ఇది.

ఈ చిత్రం లో రవితేజ నెగటివ్ క్యారక్టర్ చెయ్యడం వల్ల ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అందుకే సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. హీరో గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా రవితేజ కి భారీ నష్టాన్ని కలిగించింది ఈ చిత్రం.కానీ ఈ సినిమాకి ఓటీటీ లో మాత్రం అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. రెండువారాలు అవుతున్న, కొత్త వెబ్ సిరీస్ మరియు కొత్త సినిమాలను అప్లోడ్ చేసినప్పటికీ కూడా టాప్ 4 లో ట్రెండింగ్ అవుతుంది ఈ చిత్రం.

అమెజాన్ ప్రైమ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. కేవలం కుర్రాళ్ళు మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ యాక్టింగ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ సబ్జక్ట్స్ రాబొయ్యే రోజుల్లో కూడా చెయ్యాలని రవితేజ ని కోరుతున్నారు ఫ్యాన్స్.

కెరీర్ లో మొట్టమొదటి నెగటివ్ రోల్ ని రవితేజ ఇంత అద్భుతంగా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు, ఆడియన్స్ కి కూడా ఇది పెద్ద షాక్. కానీ ఆయన ఎందుకు అంత నెగటివ్ గా మారిన అందరినీ చంపుతున్నాడు అనే దానికి డైరెక్టర్ సుధీర్ వర్మ ఇచ్చిన కారణం ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఈ చిత్రం ఇలా ట్రెండ్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు