Telangana BJP: టికెట్ ఇస్తామన్నా రాని సీనియర్లు.. బీజేపీలో ఏంటీ పరిస్థితి?
దరఖాస్తు చేసుకోకపోతే టిక్కెట్ ఇవ్వరా అని.. హైకమాండ్ తోనే జోకులేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. నిజంగా వారు తమ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా మూడు నెలలే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. స్క్రీనింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3 పేర్లతో హై కమాండ్‌కు పంపించింది. త్వరలోనే జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పద్ధతినే అనుసరించిన బీజేపీ..
ఇక తెలంగాణలో మరో పెద్ద పార్టీ బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈమేరకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లోనే భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్నవారిలో చాలా మంది జూనియర్ నేతలే. సీనియర్లు టికెట్ దరఖాస్తుకు దూరంగా ఉన్నారు.
దరఖాస్తు చేసుకోకపోతే..
దరఖాస్తు చేసుకోకపోతే టిక్కెట్ ఇవ్వరా అని.. హైకమాండ్ తోనే జోకులేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. నిజంగా వారు తమ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.అయినా సరే వారు మాకు కాక ఇంకెవరికి టిక్కెట్ ఇస్తారన్నట్లుగా ఉన్నారు. అందుకే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కౌంటర్లు తెరిచినా ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. కింది స్థాయి నేతలు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో… రేవంత్‌రెడ్డి సహా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కూడా దరఖాస్తు చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుకు రూ.50 వేల ఫీజు పెట్టింది. బీజేపీలో అలాంటి ఫీజుల గోల లేదు. అయినా సరే సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోకపోవడంతో. సీనియర్ల తీరుపై తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్‌జవదేకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.
పరిమితంగానే అభ్యర్థులు..
బీజేపీలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు పరిమితంగానే ఉన్నారు. అగ్రనేతలు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వారు తమ నియోజకవర్గాలకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రకాశ్‌జవదేకర్ కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో.. పదో తేదీలోపు అందరూ దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. అయితే కొంత మంది దరఖాస్తు చేసుకోకపోతే ఇవ్వరా.. అన్న పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాంటి ఈగోకు పోవాల్సిన అవసరం లేదని.. పార్టీ విధానం ప్రకారం వెళ్లాలన్న బుజ్జగింపులు సీనియర్లకు వెళ్తున్నాయి.
