Senior NTR- Ashwini Dutt: అప్పటి ముచ్చట్లు: నాగుపాము కూడా ఎన్టీఆర్ ని శివుడిని తలచింది… ఈ కథ మీకు తెలుసా?
ఎన్టీఆర్ పోషించిన దేవుడు పాత్రల్లో శివుడు కూడా ఒకటి. ఓ మూవీలో ఎన్టీఆర్ త్రిమూర్తుల్లో ఒకరైన శివుడుగా నటించారు. మరి శివుడు అంటే మెడలో నాగరాజు ఉండాలి.

Senior NTR- Ashwini Dutt: రాముడు, కృష్ణుడు గురించి పుస్తకాలలో చదవమే కానీ ఖచ్చితంగా ఇలా ఉంటారని తెలియదు. గుడులు, గోపురాలపై దేవతా విగ్రహాలు, బొమ్మలు ఉన్నప్పటీకీ సామాన్యుడికి కూడా దేవుడు రూపం మీద అవగాహన వచ్చింది సినిమాతోనే. పురాణాల్లో దేవుళ్ళ రూపాలను వర్ణించిన ఆధారంగా వెండితెరపై ఆ పాత్రలను దర్శకులు ఆవిష్కరించారు. ఇక ఇండియా వైడ్ ఈ పురాణ పాత్రలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఎన్టీఆర్ కెరీర్లో అనేక పౌరాణిక పాత్రలు చేశారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి పాత్రలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చాయి.
ఎన్టీఆర్ పోషించిన దేవుడు పాత్రల్లో శివుడు కూడా ఒకటి. ఓ మూవీలో ఎన్టీఆర్ త్రిమూర్తుల్లో ఒకరైన శివుడుగా నటించారు. మరి శివుడు అంటే మెడలో నాగరాజు ఉండాలి. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ అంతగా అందుబాటులో లేవు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ టెక్నీక్స్ తో నెట్టుకొచ్చేవారు. శివుడు పాత్రకు ప్లాస్టిక్ పాము వాడేవారు. లేదంటే ట్రైనింగ్ పొందిన కోరలు లేని కోబ్రాలను ఉపయోగించేవారు. అప్పట్లో పెటా చట్టాలు లేవు కాబట్టి జంతు హింస పెద్ద నేరం కాదు. ఇక ఎన్టీఆర్ శివుడు గెటప్ వేశాక షాట్ కి రెడీ అయ్యారట.
ఈ లోపు పాములు పట్టేవాడు తన దగ్గర ఉన్న కోరలు లేని నాగుపాముకు ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఏం చేస్తున్నారు బ్రదర్ అని డైరెక్టర్ ని ఎన్టీఆర్ అడిగారట. మీ మెడలో నాగుపాము నిలబడేలా ట్రైనింగ్ ఇస్తున్నామని డైరెక్టర్ చెప్పారట. దానికి… వదిలేయండి బ్రదర్ అదే వచ్చేస్తుంది నా మెడలోకి అని, ఎన్టీఆర్ పొజిషన్ లో కుర్చున్నారట. మనకు మెదడు ఉంది పాముకు లేదు కదా, అది ఎలా మీ మెడలోకి వస్తుందని డైరెక్టర్ ఎగతాళిగా అన్నారట. నిజంగానే ఆ పాము నేరుగా వెళ్లి ఎన్టీఆర్ మెడలో హారంగా చుట్టుకుందట.
ఆ పరిణామానికి సెట్లో ఉన్నవారితో పాటు డైరెక్టర్ ఆశ్చర్యపోయారట. నిజంగా మీరు మహానుభావులు అని ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ కి దండం పెట్టేశారట. ఈ విషయాన్ని సీనియర్ నిర్మాత సీ అశ్వినీ దత్ వెల్లడించారు. ఆయన కామెంట్స్ నేపథ్యంలో ఒకప్పటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ ని అశ్వినీ దత్ దైవంలా ఆరాధిస్తారు. వైజయంతీ మూవీస్ అనే బ్యానర్ కి నామకరణం చేసింది ఎన్టీఆరే. వైజయంతీ మూవీస్ లోగోలో శంఖం పూరిస్తున్న కృష్ణుడు ఎన్టీఆర్ ఉంటారు. ఎన్టీఆర్ తో కూడా అశ్వినీ దత్ పలు చిత్రాలు నిర్మించారు.