Karthika Nair: ఘనంగా కార్తీక పెళ్లి.. హాజరైన చిరంజీవి, సినీ ప్రముఖులు.. వైరల్ ఫొటోలు
Karthika Nair: హీరోయిన్ కార్తీక వివాహం ఘనంగా జరిగింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం కార్తీక వివాహానికి వేదిక అయ్యింది. నవంబర్ 19 ఆదివారం ఉదయం రోహిత్ మీనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి ప్రత్యేకంగా హాజరయ్యారు. అలాగే 80-90 హీరోయిన్స్ సుహాసిని, రాధిక, రేవతి, మేనకతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కార్తీకకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. […]

Karthika Nair: హీరోయిన్ కార్తీక వివాహం ఘనంగా జరిగింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం కార్తీక వివాహానికి వేదిక అయ్యింది. నవంబర్ 19 ఆదివారం ఉదయం రోహిత్ మీనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి ప్రత్యేకంగా హాజరయ్యారు. అలాగే 80-90 హీరోయిన్స్ సుహాసిని, రాధిక, రేవతి, మేనకతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కార్తీకకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి కార్తీక. ఈమె టాలీవుడ్ లో సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కార్తీక హీరోయిన్ గా నటించింది. నాగార్జున-రాధిక వారసులు కలిసి నటించారు. జోష్ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. చైతు, కార్తీక లుక్స్ పై కూడా విమర్శలు వినిపించాయి. రంగం మూవీతో కార్తీకకు బ్రేక్ వచ్చింది.
View this post on Instagram
జీవ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు ఎన్టీఆర్ పక్కన బంపర్ ఆఫర్ వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన దమ్ము చిత్రంలో కార్తీక హీరోయిన్. త్రిష మరో హీరోయిన్ గా నటించింది. దమ్ము విజయం సాధిస్తే కార్తీక కెరీర్ మరోలా ఉండేది. దమ్ము ప్లాప్ కావడంతో స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్సులు రాలేదు.
View this post on Instagram
అల్లరి నరేష్ కి చెల్లిగా నటించి షాక్ ఇచ్చింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి మూవీలో అన్నయ్యను కూడా భయపెట్టే ఓ క్రేజీ రోజ్ చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి కూడా నిరాశపరిచింది. కార్తీక కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. దీంతో ఆమె సినిమాలు మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్తీక తల్లి రాధిక ఈ మధ్య తెలుగు డాన్స్ రియాలిటీ షోలలో జడ్జిగా సందడి చేస్తుంది.
Annayya #Chiranjeevi garu attended @ActressRadha‘ s Daughter @KarthikaNair9 and Rohit wedding in Trivandrum
Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/3ZOATcHuRa
— శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్ (@PathinaSrinu) November 19, 2023
