Sarath Babu Passes Away: సీనియర్ నటుడు శరత్ బాబు కన్ను మూత.. శోకసంద్రం లో టాలీవుడ్
శరత్ బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునేలోపే కాసపతి క్రితమే ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారని,వెంటనే ICU వార్డు కి తరలించి వెంటిలేటర్ పై పడుకోపెట్టి చికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయిందని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.

Sarath Babu Passes Away: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో విషాదం అలుముకుంది.హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో కలిపి సుమారుగా 250 కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు గత కొంత కాలం క్రితం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ లో తీవ్రమైన అస్వస్థత కారణం అత్యవసర చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే ఆయన ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడి నేడు తన తుది శ్వాస ని విడిచినట్టు AIG హాస్పిటల్స్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇన్ఫెక్షన్ కారణం గా శరీరం లో ప్రధాన భాగాలైన కాలేయం, ఊపిరి తిత్తులు మరియు కిడ్నీ లు చెడిపోయాయని.కానీ అత్యవసర చికిత్స అందించడం తో ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడని, ICU నుండి నార్మల్ వార్డు కి మార్చమని గతం లో డాక్టర్లు చెప్పుకొచ్చారు.
ఇక శరత్ బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునేలోపే కాసపతి క్రితమే ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారని,వెంటనే ICU వార్డు కి తరలించి వెంటిలేటర్ పై పడుకోపెట్టి చికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయిందని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు. 71 సంవత్సరాల వయస్సున్న శరత్ బాబు రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత తెలుగు , హిందీ మరియు తమిళ బాషలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి లెజండరీ యాక్టర్ గా నిలిచాడు. ఆయన వెండితెర మీద చివరి సారిగా కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ .ఈ సినిమాలో ఆయన బార్ కౌన్సిల్ మెంబెర్ గా కనిపించాడు. ఆ తర్వాత వసంత ముల్లై అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ ఏడాది ప్రారంభం లోనే ఈ చిత్రం విడుదలైంది.