Chiranjeevi – Bhanu Chander : పక్కవాళ్ళ మాట విని చిరంజీవి మోసపోతున్నారు.. సీనియర్ నటుడు భాను చందర్ షాకింగ్ కామెంట్స్
మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి , నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళం.నాకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని దగ్గరుండి నేర్పించింది చిరంజీవే,

Chiranjeevi – Bhanu Chander : మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన తోటి నటులు ఎంతో గొప్పగా మాట్లాడడం ఇది వరకు మనం చాలాసార్లు చూసాము.ముఖ్యంగా ఆయనతో పాటుగా కెరీర్ ని ప్రారంభించిన నటులు, ఆయన గురించి , ఆయనతో ఉన్న స్నేహం గురించి తోటి రీసెంట్ గా జరిగిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు.వారిలో ఒకరు భానుచందర్, ఈయన తెలుగు మరియు తమిళం బాషలలో గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు.
ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా గొప్పగా రాణించాడు, ఈయనకి చిరంజీవి మరియు సుమన్ మంచి స్నేహితులు. చిరంజీవి తో ఆయన అప్పట్లో ‘మనవూరి పాండవులు’ అనే చిత్రం లో కలిసి నటించాడు. ఇందులో భాను చందర్ కూడా చిరంజీవి తో పాటు నలుగురిలో ఒకడు, కృష్ణం రాజు మెయిన్ హీరోగా నటించాడు. అప్పట్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి తో తనకి ఏర్పడిన స్నేహం గురించి భానుచందర్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి , నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళం.నాకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని దగ్గరుండి నేర్పించింది చిరంజీవే, మేమిద్దరం ఒకరిని ఒకరు ‘రా’ అనే పిలుచుకుంటూ ఉంటాము.
చిరంజీవి చాలా మంచి వ్యక్తి,కానీ ప్రతీ ఆర్టిస్టు వెనుక ఒకరు ఉంటారు కదా, అలా చిరంజీవి వెనుక కూడా ఒకరు ఉన్నారు, అతని చెప్పుడు మాటలు వినడం చిరంజీవి మానేస్తే మంచిది’ అంటూ భాను చందర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన చెప్పిన మనిషి ఎవరు, అతని వల్ల చిరంజీవికి ఏమి నష్టం వచ్చింది అనేది సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు.
