Geethanjali Heroine Girija: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచినా సినిమా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘గీతాంజలి’ అనే సినిమా..క్యాన్సర్ తో చావు కి ఇంచు దూరం లో ఉన్న ఇద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే అంశం ని ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు..ఇక ఈ చిత్రంలోని పాటలు ఎంతతి సెన్సషనల్ హిట్ అయ్యాయో మన అందరికి తెలిసిందే..నేటి తరం యువత కూడా మొబైల్ ఫోన్ లో తమ ప్లేలిస్ట్ లో గీతాంజలి సినిమా పాటలు లేకుండా ఉండదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అటు కమర్షియల్ గాను ఇటు కంటెంట్ పరంగాను ఆల్ టైం క్లాసిక్ గా నిలిచి ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాదు..తమిళం లో కూడా పెద్ద హిట్..నాగార్జున కి ఈ సినిమా సౌత్ లో అన్నీ చోట్ల మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గిరిజ గారిని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..నాగార్జున తో సమానంగా ఈమె కూడా ఎంతో అద్భుతంగా నటించింది.

Girija Shettar
Also Read: Couples Bathing In Holy River: పవిత్ర నదిలో స్నానం చేస్తూనే ఆ దంపతులు ఏం చేశారంటే? వైరల్ వీడియో
తొలి సినిమాతోనే అంతతి సంచలన విజయం అందుకోవడం తో గిరిజ గారికి వరుసగా హీరోయిన్ ఆఫర్లు వెల్లువెత్తాయి..కానీ ఆమె అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసింది..కానీ ఈ గ్లామర్ ఫీల్డ్ లో అందాలు ఆరబొయ్యకపోతే అవకాశాలు రావు..అందుకే గిరిజ తెలుగు , హిందీ మరియు మలయాళం భాషలకు కలిపి కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించింది..తెలుగులో ఆమె గీతాంజలి తర్వాత హృదయాంజలి అనే సినిమాలో నటించింది..ఇక హిందీ లో అమిర్ ఖాన్ తో ఒక సినిమా..మలయాళం లో మోహన్ లాల్ తో మరో సినిమా నటించింది..ఇక ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి లండన్ లో స్థిరపడిపోయింది..ఇక గిరిజ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈమె తల్లి తండ్రులు లండన్ లో స్థిరపడిన ఇండియన్స్..గిరిజ చిన్నతనం నుండి ఇక్కడే పుట్టి పెరిగింది..ఈమె తండ్రి ఒక డాక్టర్ కాగా, తల్లి ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేత్త..గిరిజ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు..చిన్నప్పటి నుండి భారత నాట్యం నేర్చుకోవాలనే మక్కువ ఉండడం తో ఇండియా కి వచ్చినప్పుడు చెన్నై లో శ్రీకళ భరత్ అనే నృత్యకళాకారుడి దగ్గర భారత నాట్యం నేర్చుకుంది..కళ గారి సోదరుడు కృష్ణమచారి శ్రీకాంత్ గారు మణిరత్నం గారికి బాగా క్లోజ్..మణిరత్నం మరియు సుహాసిని గార్ల పెళ్ళికి శ్రీకాంత్ తో కలిసి హాజరు అయ్యిందట గిరిజ..అక్కడ మణిరత్నం గారి సోదరుడు జీవి గిరిజ ని చూసిన వెంటనే బాగా ఆకర్షితులై ఆమె వద్దకి వెళ్లి ‘సినిమాల్లో నటిస్తావా అని అడిగారట’ గిరిజ వెంటనే ఓకే చెప్పి స్క్రీన్ టెస్ట్ పాస్ అయ్యి గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది..ఇటీవల ఈమె ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు..ఆ ఇంటర్వ్యూ లోనే ఈమె విషయాలను వెల్లడించారు.

Girija
Also Read: Enemies Of Tollywood: అరుదైన ఘట్టం ఒక్క చోట చేరిన బద్దశత్రువు… ఇలా కలుస్తారని అసలు ఊహించలేదు.