Tripura Violence: ఈశాన్య రాష్ర్టం త్రిపురలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంతో పెద్ద ఎత్తున దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఒక వర్గాని చెందిన వారిపై మరో వర్గం దాడులకు తెగబడినట్లు సమాచారం. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి త్రిపుర అల్లకల్లోలంగా మారింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినట్లు తెలుస్తున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు కాళికా అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దాడులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బంగ్లాదేశ్ లో దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న దాడులకు ప్రతీకారంగా పక్కనే ఉన్న త్రిపురలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. త్రిపురలో చోటుచేసుకున్న పరిణామాలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల్లో కొన్ని మత సంస్థలు పాల్గొన్నట్లు తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ జరిగిన వాటికి మన దగ్గర ప్రతీకారం తీర్చుకునే క్రమంలో దాడులు చేయడంపై అందరు ఖండిస్తున్నారు.
Also Read: Modi PM: బీజేపీ సంచలన ప్రకటన : 2024లోనూ మోడీనే ప్రధాని.. వర్కవుట్ అవుతుందా?
దాడుల్లో 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నార్త్ త్రిపురలోని ఫణిసాగర్ లో మసీదుపై దాడులు జరిగాయంట వచ్చిన వార్తలపై స్పందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దాడులపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు రాష్ర్ట సాంస్కృతిక శాఖ మంత్రి సుశాంత చౌదరి పేర్కొన్నారు. నవంబర్ 10లోగా నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
Also Read: Huzurabad and Badvel: హుజూరాబాద్, బద్వేలులో ప్రారంభమైన పోలింగ్.. ప్రశాంతంగా ఎన్నికలు