Secret Media Partner In Controversial Pub : అది జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిలో చెప్పుకోదగ్గ పాపులర్ పబ్. అయితే ఒక సంఘటనతో అది అపఖ్యాతి పాలైంది. పబ్ యజమానులు అనుసరించాల్సిన కఠినమైన నియమం ఏమిటంటే., చట్టబద్ధంగా అనుమతించబడిన వారి వయస్సును నిర్ధారించిన తర్వాత మాత్రమే వారి కస్టమర్‌లను వారి ప్రాంగణంలోకి అనుమతించడం. అయితే ఈ నిండా 18 ఏళ్లు కూడా లేని వారిని అనుమతించారు. మైనర్ల పార్టీకి అనుమతించారు. ఆ పార్టీ చేసుకున్న తర్వాత మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో ఆమ్నీషియా పబ్ ఈ వివాదంలో చిక్కుకుంది.
అసలు నేరం జరిగిన ప్రదేశం ఈ పబ్ ప్రాంగణం వెలుపల ఉన్నప్పటికీ.. మైనర్‌లను వారి పబ్ లోకి అనుమతించినందున పబ్ యజమానులు కూడా నేరంలో భాగస్వాములయ్యారు. కేసు ఇంకా విచారణలో ఉండగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన సీక్రెట్ బయటకు వచ్చింది.
దాదాపు అన్ని ఛానెల్‌లు మరియు వెబ్‌సైట్‌లు సంఘటనను నివేదించేటప్పుడు పబ్ పేరును బహిరంగంగా వ్యక్తపరిచాయి. కానీ ఒక ప్రధాన టాప్ ఛానెల్ మాత్రం.. అత్యాచార ఘటన మరియు బాలికపై దృష్టి సారించింది. పబ్‌పై అస్సలు రాయలేదు. దీనివెనుక కారణం ఏంట్రా అని అందరూ ఆరాతీయగా ఆసక్తికర విషయం జర్నలిస్ట్ సర్కిల్స్ లో వెలుగులోకి వచ్చింది..
ఆ ఛానెల్ పబ్ పేరు కూడా మీడియాలో రాకపోవడానికి కారణం ఆ మీడియా పెద్దమనిషి అప్పుడు అక్కడ ఉండడం… ఈ విషయం తెలుసుకున్న ఛానల్ యాజమాన్యం.. పబ్ నేరం బయటపడినప్పుడు తప్పించుకున్నందుకు క్రైమ్ రిపోర్టర్‌ను పిలిచి మందలించింది.
దీనికి క్రైమ్ రిపోర్టర్ వివరణ ఇచ్చాడు. అదే టీవీ ఛానెల్‌కు చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్ ఈ పబ్ వ్యాపారంలో భాగస్వామి కాబట్టి పబ్ పేరు బయటకు రావద్దని సూచించాడు.. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఛానల్ యాజమాన్యం క్రైం రిపోర్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
అందుకే ఆ చానెల్ వార్తా నివేదికలో పబ్ పేరును కవర్ చేయలేకదట.. ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందని గమ్మున ఊకున్నారు. కానీ తన ఉద్యోగి జరుగుతున్న వ్యాపారంలో భాగస్వామి అని తెలుసుకున్నందుకు మరి ఆపోస్ట్ ను ఉంచుతారా? ఊడగొడుతారా? అన్నది వేచిచూడాలి. .