Unthakallu Panduranga Swami Temple: అక్కడకు వెళ్తే మద్యం తాగే అలవాటు మానుతారు తెలుసా?
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో ఉంతకల్లు అనే గ్రామంలో పాండురంగ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న దేవుడు మద్యం మాన్పిస్తాడట. ఏకాదశి రోజు ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పలు చోట్ల నుంచి చాలా మంది వస్తుంటారు. భక్తులు మాల వేసుకుని వస్తారు. దీక్షలు, ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ఊరు ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఊరంతా పాండురంగ స్వామి భక్తులే కావడం విశేషం.

Unthakallu Panduranga Swami Temple: మనలో చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటుంది. అది కూడా కొంచెం కాదు. ఫుల్లుగా తాగి ఎక్కడో పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఇల్లు చేరడం కూడా కష్టమే. దీంతో కట్టుకున్న ఇల్లాలు రాత్రంతా అతడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అయినా వారు సాయంత్రం అయిందంటే చాలు చుక్క కోసం తాపత్రయపడుతుంటారు. మద్యం తాగనిదే ఇంటికి వెళ్లరు. ఇలా మద్యం ప్రియుల ఆగడాలు వారి భార్యలే భరిస్తుంటారు. అలాంటి మధ్యం అలవాటు వద్దని వారిస్తున్నా వినరు. కానీ వారి అలవాటును మాన్నించే ఓ మహత్తరమైన దేవుడున్నాడంటే అతిశయోక్తి కాదు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో ఉంతకల్లు అనే గ్రామంలో పాండురంగ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న దేవుడు మద్యం మాన్పిస్తాడట. ఏకాదశి రోజు ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పలు చోట్ల నుంచి చాలా మంది వస్తుంటారు. భక్తులు మాల వేసుకుని వస్తారు. దీక్షలు, ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ఊరు ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఊరంతా పాండురంగ స్వామి భక్తులే కావడం విశేషం.
ఈ ఆలయాన్ని 2005లో రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయాన్ని కట్డడం ప్రారంభించారు. దీని బాధ్యత అంతా గ్రామస్తులదే వచ్చిన భక్తులకు వసతి ఏర్పాటు చేస్తారు. భోజనం కూడా పెడతారు. మద్యం అలవాటు నుంచి బయటపడటానికి పాండురంగ స్వామి మాలధారణ చేస్తారు. దీంతో ఆ వ్యసనం నుంచి బయటపడతారు. స్వామి మీద ఉన్న భక్తి మద్యం తాగేవారిలో మార్పు తీసుకొస్తుంది. దీంతో మద్యం అలవాటుకు దూరంగా ఉంటారు. ఇలా మద్యం తాగే అలవాటును మాన్పించే ఆలయంగా ఇది కీర్తి గడించింది.