IND vs NZ ODI : టీమిండియా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో విమర్శల పాలైంది. ఇక రెండో వన్డే నేడు జరగనున్నా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముంది. దీంతో న్యూజిలాండ్ విజయంతో పతకాల పట్టికలో ముందు నిలిచింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డేను న్యూజిలాండ్ కు అప్పగించడంతో టీమిండియాపై వేటు పడుతోంది. మరికొద్ది సేపట్లో హోమిల్టన్ లోని సెడాన్ పార్కులో ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అనే సందేహాలు వస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇందులో ఓటమి పాలైతే టీమిండియా ఆశలు గల్లంతే. దీంతో వర్షం పడొద్దని అభిమానులు కోరుకుంటున్నా ప్రకృతి ఏం చేస్తుందనే దానిపైనే అందరికి అనుమానాలు వస్తున్నాయి. టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగుతుంది. వర్షం కారణంగా పిచ్ పై చాలా సేపు కవర్లు కప్పి ఉంచారు. దీంతో పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు సహకరిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం సాధిస్తుందా? లేక పరాజయంతో కప్ ను అప్పగిస్తుందా అని సందేహాలు వస్తున్నాయి.
టీమిండియా ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. సంజూ శాంసన్ మళ్లీ బెంచ్ కే పరిమితవుతాడని చెబుతున్నారు. శార్దూల్ ను కూడా పక్కన పెట్టనున్నారు. రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకున్నారు. దీపక్ హుడా, దీపక్ చాహర్ లను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకోనున్నారు. దీంతో టీమిండియా ఫలితం సాధిస్తుందా? లేదా అనే సంశయాలు వస్తున్నాయి. మొత్తానికి టీమిండియా ఇటీవల పరాజయాలే వేధిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ ను నిలువరిస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
టీమిండియా జట్టులో శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్య్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్ వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్ లు ఉన్నారు.