ఐపీఎల్‌ పై కరోనా నీడ… హోలికి ప్రధాని దూరం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌ను కూడా కలవరపెడుతోంది. భారత్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. అయితే ఐపీఎల్‌కు కరోనా ప్రభావం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎల్‌కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే దానిపై దృష్టిసారిస్తాం అని వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారంకూడా ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి […]

  • Written By: Neelambaram
  • Published On:
ఐపీఎల్‌  పై కరోనా నీడ… హోలికి ప్రధాని దూరం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌ను కూడా కలవరపెడుతోంది. భారత్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. అయితే ఐపీఎల్‌కు కరోనా ప్రభావం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

ఇప్పటివరకు ఐపీఎల్‌కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే దానిపై దృష్టిసారిస్తాం అని వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారంకూడా ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌, ఐపీఎల్‌ యథావిధిగా జరుగుతాయని చెప్పారు. భారత్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ గురించి చర్చించలేదు అని తెలిపాడు.

మరోవంక, కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తూ ఉండడంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం విదితమే.
ఉత్తర భారతదేశంలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో హోలీ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు.

భారత్ లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌ (ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

సంబంధిత వార్తలు