Scam 2003 Trailer Talk: స్కామ్ 2003 ట్రైలర్ రివ్యూ: దేశాన్ని కుదిపేసిన స్కాన్, తెల్గీ వెరీ స్మార్ట్!
దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే స్థాయిలో తెల్గీ స్కామ్ చేశాడు. ఈ తెల్గీ కథను వెబ్ సిరీస్ గా తెరపైకి తెచ్చారు. సోని లివ్ లో స్కామ్ 2003 టైటిల్ తో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమ్ కానుంది. నేడు ట్రైలర్ విడుదల చేశారు.

Scam 2003 Trailer Talk: తెల్గీ రెండు దశాబ్దాల క్రితం ఈ పేరు ఓ సెన్సేషన్. ఇండియా గవర్నమెంట్ ఉలిక్కిపడేలా చేసిన చేసిన వ్యక్తి అతను. పెద్దగా చదువులేని అబ్దుల్ కరీం తెల్గీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన తెల్గీ బాల్యంలో పండ్ల వ్యాపారం చేసేవాడు. పెద్దయ్యాక సౌదీ అరేబియా వెళ్ళాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియా వచ్చి ముంబై వేదికగా నేరాలకు తెరలేపాడు. సౌదీ అరేబియాకు లేబర్ ని పంపే ఆఫీస్ తెరిచిన తెల్గీ మొదట్లో ఫేక్ పాస్ పోర్ట్స్ దందా చేశాడు.
అనంతరం అతడి దృష్టి స్టాంప్ పేపర్స్ పై పడింది. కరెన్సీ కంటే నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేయడం సులభం అని తెలుసుకున్నాడు. పెద్ద ఎత్తున స్టాంప్ పేపర్స్ ముద్రించి బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు బల్క్ లో అమ్మడం మొదలుపెట్టాడు. తన చీకటి వ్యాపారంలో కొందరు అధికారులను భాగం చేసుకున్నాడు. తెల్గీ ఏకంగా రూ. 30 వేల కోట్ల స్కామ్ కి పాల్పడ్డాడని సమాచారం.
దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే స్థాయిలో తెల్గీ స్కామ్ చేశాడు. ఈ తెల్గీ కథను వెబ్ సిరీస్ గా తెరపైకి తెచ్చారు. సోని లివ్ లో స్కామ్ 2003 టైటిల్ తో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమ్ కానుంది. నేడు ట్రైలర్ విడుదల చేశారు. తెల్గీ ఎంత స్మార్ట్, అతని మాట తీరు ఎలా ఉండేదో, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేసేవాడో ట్రైలర్ లో చూపించాడు. తెల్గీ ట్రైలర్ ఆకట్టుకుంది. తెల్గీ పాత్రను గగన్ దేవ్ రియర్ చేశారు.
స్కామ్ 2003 సిరీస్ కి తుషార్ హీరానందాని దర్శకత్వం వహించారు. భరత్ జాదవ్, షాద్ రంధావా, ముఖేష్ తివారి, సనా అమీన్ షేక్ ఇతర కీలక రోల్స్ చేశారు. తెల్గీకి కోర్ట్ 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 13 ఏళ్ళు జైల్లో ఉన్న తెల్గీ 2017లో బెంగుళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశాడు.
