Godse Movie Review: గాడ్సే మూవీ రివ్యూ
Godse Movie Review: నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, బహ్మాజీ, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, నోయల్, పృథ్విరాజ్ తదితరులు దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి నిర్మాతలు: సి. కళ్యాణ్ సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం ఎడిటింగ్: సాగర్ ఉడగండ్ల మ్యూజిక్: సునీల్ కశ్యప్ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్సే. దర్శకుడు గోపీగణేష్ పట్టాభి తెరకెక్కించగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చేశారు. జూన్ 17న విడుదలైన గాడ్సే మూవీ ఎలా ఉందో […]

Godse Movie Review: నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, బహ్మాజీ, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, నోయల్, పృథ్విరాజ్ తదితరులు
దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
నిర్మాతలు: సి. కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
ఎడిటింగ్: సాగర్ ఉడగండ్ల
మ్యూజిక్: సునీల్ కశ్యప్

Godse Movie Review
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్సే. దర్శకుడు గోపీగణేష్ పట్టాభి తెరకెక్కించగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చేశారు. జూన్ 17న విడుదలైన గాడ్సే మూవీ ఎలా ఉందో విశ్లేషణలో చూద్దాం..
Also Read: Ram Gopal Varma- Apsara Rani: అప్సర అందాలను తట్టుకోలేక రాంగోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా?
కథ:
గాడ్సే కథ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో సడన్ గా ప్రముఖులు కిడ్నాప్ అవుతూ ఉంటాయి మినిస్టర్స్, పోలీస్ ఆఫీసర్లు,చీఫ్ జస్టిస్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ల బినామీలు వరుసగా కిడ్నాప్ కి గురవుతారు. ప్రముఖుల అరెస్ట్ తో ఒక్కసారిగా అలెర్ట్ అయిన గవర్నమెంట్, పబ్లిక్ కి తెలియకుండా ఈ కేసు ఛేదించాలని అనుకుంటారు. ఈ ఆపరేషన్ ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి)కి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. ఆ కిడ్నాప్స్ చేసిన వ్యక్తి లండన్ కి చెందిన తెలుగువాడు విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే బిజినెస్ మ్యాన్ అని తెలుసుకుంటారు. గాడ్సే పేరుతో విశ్వనాథ్ రామ చంద్ర ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తిస్తారు. బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? ఆయన రాజకీయనాయకులను, అధికారులను కిడ్నాప్ చేయడం వెనుక కారణం ఏమిటీ? చివరి గాడ్సే ఏం చేశాడు? అనేది తెరపైన చూడాలి.

Godse Movie Review
విశ్లేషణ:
పైన చెప్పిన కథ పరిశీలిస్తే ఈ సినిమా ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సమాజంలో, వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, అరాచకం, అన్యాయాలపై ఓ వ్యక్తి పోరాటం. ఈ తరహా కథలు అనేకం చూశాం. అయితే ఎలా చెప్పాడన్నదే ముఖ్యం. గాడ్సే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే సినిమాకు మంచి ఆరంభం లభించింది. కానీ ఆ టెంపో దర్శకుడు కొనసాగించలేకపోయాడు. హీరో ఎమోషన్స్ ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. డైలాగ్స్ మాత్రం నేటి పరిస్థితులను ప్రతిబించేవి గా ఉన్నాయి. కొందరు రాజకీయ నాయకులు, అధికారులకు సూటిగా తగిలేవిగా ఉన్నాయి.
ఇలాంటి థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లే ప్రధానం. గాడ్సే స్క్రీన్ ప్లే మెల్లగా సాగుతుంది. దీంతో ప్రేక్షకులు అంతగా థ్రిల్ ఫీల్ కారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏమంత ఆకట్టుకోలేకపోయింది. అంచనాలు అందేలా ఉన్న సదరు ఫ్లాష్ బ్యాక్ నిరాశపరిచింది. చాల సన్నివేశాలు దర్శకుడు రోజూవారి న్యూస్ లో వచ్చే సంఘటనల స్పూర్తితో రాసుకున్నట్లు ఉన్నాడు. గాడ్సే ఆసక్తిగా తెరక్కించడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయారు.

Godse Movie Review
సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ పాటలు ప్రభావం చూపకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్లేదు. సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాలి.కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు సరపడే స్దాయిలో లేవు. గోపీ గణేష్ రాసుకున్న డైలాగులు బాగున్నాయి. కొన్ని పొలిటికల్ డైలాగ్స్ బాగా పేలాయి. సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన భుజాన వేసే ప్రయత్నం చేసారు. మోసాడు. దాంతో సినిమాలో చాలా మంది ఆర్టిస్ట్ లు ఉన్నా సత్యదేవ్ డామినేట్ చేస్తూ కనపడతాడు. ఇక తమిళ అమ్మాయి ఐశ్వర్య బాగానే చేసింది. ప్రియదర్శి, నోయల్ సత్యదేవ్ ఫ్రెండ్స్ పాత్రల్లో బాగా చేశారు.
ప్లస్ పాయింట్స్:
యాక్షన్ ఎపిసోడ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
ప్రొడక్షన్ వాల్యూస్
ఎడిటింగ్
కథ
సినిమా చూడాలా? వద్దా?
పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి గాడ్సే నచ్చే అవకాశం లేకపోలేదు. మెల్లగా సాగే కథనం, కొత్తదనం లేదని కథతో పాటు ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడంతో సినిమా ఫలితం దెబ్బతింది. డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు చెప్పుకోదగ్గ అంశాలు. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే బాగుండేదేమో.
రేటింగ్: 2.25
Also Read:Manchu Vishnu Jinnah Movie: జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!