Masooda Movie Review: ‘మసూద’ మూవీ రివ్యూ
Masooda Movie Review: ముని, కాంచన, గంగ, కాంచన 3 ఈ సినిమాలన్నీ కామన్ గానే ఉంటాయి. స్టోరీ మొత్తం ఒకే తీరున ఉంటుంది. కానీ టేకింగ్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అదే ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే కాంచన సీరిస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నాలుగో భాగం కూడా రెడీ అవుతోంది. సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే గ్రిప్పింగ్ కథ, కథనం ఉండాలి. ప్రేక్షకులను సీట్ చివరి అంచులో కూర్చో బెట్టాలి. ఇప్పుడు […]

Masooda Movie Review: ముని, కాంచన, గంగ, కాంచన 3 ఈ సినిమాలన్నీ కామన్ గానే ఉంటాయి. స్టోరీ మొత్తం ఒకే తీరున ఉంటుంది. కానీ టేకింగ్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అదే ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే కాంచన సీరిస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నాలుగో భాగం కూడా రెడీ అవుతోంది. సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే గ్రిప్పింగ్ కథ, కథనం ఉండాలి. ప్రేక్షకులను సీట్ చివరి అంచులో కూర్చో బెట్టాలి. ఇప్పుడు ఓటీటీ ల్లో కూడా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. వాటికి మించి ఉంటేనే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. లేకుంటే ఇక అంతే సంగతులు. అయితే ఇలాంటి హర్రర్ కథా వస్తువుతో “మసూద” అనే సినిమా శుక్రవారం విడుదలైంది. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మళ్ళీ రావా” చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు. దీనికి సాయి కిరణ్ దర్శకుడు. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం..

Masooda Movie Review
కథ ఏంటంటే
ఇది రొటీన్ హర్రర్ కథా చిత్రమే. ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. దానిని వదిలించేందుకు ఆమె తల్లి పడే తపన, ఆమెకు సాయం చేసే యువకుడు..ఇదే ప్రధాన కథ. నాటి తులసీదళం నుంచి అరుంధతి వరకు చూసింది మొత్తం ఇంచు మించుగా ఇవే కథలు. ఈ సినిమాలో పట్టిన దెయ్యం, విడిపించే తీరు అంతా ఇస్లాం మతానికి సంబంధించినవై ఉంటాయి. అది ఒక్కటే ఇందులో కొత్తదనం. ఇక ఈ సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బలమైన నేపథ్య సంగీతంతో వణుకు పుట్టిస్తుంది. ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. కానీ క్రమక్రమంగా వీక్ సన్నివేశాల వల్ల అది తగ్గుతుంది.. సినిమా మొదలై 45 నిమిషాలు గడిచినా కాన్ _ ప్లిక్ట్ పాయింట్ అసలు కనిపించదు. ఆర్టిస్టులు పెద్ద స్టార్లు కాకపోయినా వారి వారి పాత్రల మేరకు నటించారు. కథా పరంగా చూస్తే ఇక్కడ దెయ్యానికి అని సినిమాల మాదిరి రివెంజ్ డ్రామా ఉండదు..దీనివల్ల హుక్ పాయింట్ పెద్దగా కనిపించదు. ఇందులో బాధిత కుటుంబానికి, హీరోకు ఎటువంటి సంబంధం ఉండదు. సెకండాఫ్ లో ఉత్కంఠ గలిపే సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి ఎందుకో డ్రాగ్ లాగా కనిపిస్తాయి.
పాత్రలు ఎలా ఉన్నాయంటే
ఇందులో సంగీత సైన్స్ టీచర్ గా కనిపిస్తుంది. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కు పెద్దగా స్కోప్ లేదు. హీరో పక్కన హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది. హీరో తిరువీర్ భయస్తుడి పాత్రలో ఎంతో వినోదం పంచే స్కోప్ ఉన్నా ఎందుకో దర్శకుడు వాడుకోలేదు. ఇక దెయ్యం పట్టిన పాత్రలో అఖిల మాత్రం సూపర్బ్ గా చేసింది. బాబా గా సత్యం, రిజ్వాన్ గా శుభలేఖ సుధాకర్ బాగా నటించారు. మొత్తానికి మసూద అక్కడక్కడ భయపెట్టింది. మధ్య మధ్యలో సహనానికి పరీక్ష పెట్టింది. ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా మీద నమ్మకం వల్ల మేకర్స్ సీక్వెల్ లీడ్ ఇచ్చేందుకు 5 నిమిషాలు తీసుకున్నారు. అంటే మసూద_2 ఉండబోతుందని చెప్పారు. లిమిటెడ్ బడ్జెట్ లో తీసినా ఒక ప్రాంచైజీ వాల్యూ కలిపించాలి అనుకున్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, వీటికి తోడు భయపడాలి అనుకుంటే భేషుగ్గా సినిమాకు వెళ్ళొచ్చు.

Masooda Movie Review
ప్లస్ లు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
సెకండ్ ఆఫ్
మైనస్ లు
ఇంటర్వెల్ బ్యాంగ్
వీక్ కన్ ప్లిక్ట్ పాయింట్
రొటీన్ స్టోరీ
బాటమ్ లైన్: కొంచెం భయం, కొంచెం విసుగు
రేటింగ్: 2.5/5
