Samantha Shaakuntalam: ప్రియుడితో మంచులో సమంత విహారం
Samantha Shaakuntalam: సీనియర్ నటి సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంతలో సినిమాకు సంబందించిన అనేక విషయాలు అప్డేట్ అవుతున్నాయి. తాజాగా సమంత ప్రియుడితో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచుకొండల్లో వీరిద్దరు కలిసున్న ఫొటో పై అనేక ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. అయితే […]


Samantha Shaakuntalam
Samantha Shaakuntalam: సీనియర్ నటి సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంతలో సినిమాకు సంబందించిన అనేక విషయాలు అప్డేట్ అవుతున్నాయి. తాజాగా సమంత ప్రియుడితో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచుకొండల్లో వీరిద్దరు కలిసున్న ఫొటో పై అనేక ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఓ సాంగ్ లో భాగంగానే సమంత ఈ సీన్ లో నటించినట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా రిలీజైన ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.
సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. వీరితో పాటు మోహన్ బాబు, గౌతమి, ఈషా రబ్బా లు నటిస్తున్నారు. ఆసక్తికర విషయమేంటంటే ఇందులో అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ కూడా కనిపించబోతుంది. ఈమెను భరతుడి పాత్రలో చూపించబోతున్నారు. దిల్ రాజుతో కలిసి ఈ సినిమాకు గుణశేఖర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన తనయ నీలిమ గుణ సినిమాను నిర్మిస్తోంది. దీనిని తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
భారీ అంచనాల మధ్య రెడీ అవుతున్న ‘శాకుంతలం’ నుంచి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మల్లికా.. మల్లికా.. అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత యెలెలో యెలెలో అనే పాటను విడుదల చేశారు. ఇక లేటేస్టుగా మధుర గతమా అనే పాటను ప్రేక్షకుల ముందుంచారు.ఈ సాంగ్ ను శ్రీమణి రచించగా అర్మన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ సాంగ్ క్రియేషన్ లో భాగంగా సమంత మంచుకొండల్లో విహరించినట్లు చూపించారు. అయితే ఈ పాట మొత్తంలో మంచు కొండలు కనిపిస్తున్నారు. వీటి కోసం హిమాలయాలకు వెళ్లారా? లేక ఇక్కడే సెట్ వేశారా?అనేది తెలియాల్సి ఉంది.

Samantha Shaakuntalam
గణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ హిస్టారికల్ నేపథ్యంలో రూపుదిద్దకుంటోంది. అనన్య నాగళ్ల, అతిథి బాలన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సమంత అంతకుముందు హీరోయిన్ ఓరియెంటెడ్ యశోధ మూవీ చేసిన విషయం తెలిసింది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. యశోధ తరువాత సమంత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ ‘శాకుంతలం’ తో థియేటర్లోకి రానుంది. దీంతో శాకుంతలంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
