Yashoda Movie OTT: హీరో పక్కన నటించడం కన్నా.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సమంతకు బాగా కలిసొస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన ‘యూటర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అదే స్థాయిలో ఇప్పుడు ‘యశోద’ కూడా సక్సెస్ బాటలో వెళ్తోంది. మొన్నటి వరకు ఇలాంటి పాత్రలో అనుష్క మాత్రమే చేసేవారు. ఇప్పుడు సమంత కూడా తనదైన శైలిలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ‘యశోద’ విడుదలైన వారం రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించాయి. ఇప్పటివరకు చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించాయి అని చెప్పవచ్చు. అయితే మధ్యలో కృష్ణ మరణం సందర్భంగా కొన్ని రోజులు డల్ అయ్యాయి. ఆ తరువాత మిగతా సినిమాలు రిలీజ్ కావడంతో వసూళ్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో యశోదను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఆ తేదీ ఏదంటే..?

samantha
నవంబర్ 11న విడుదలైన యశోద సినిమాలో సమంత భిన్నమైన పాత్రలో నటించింది. ఆమె నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత వచ్చిన తెలుగు సినిమా ఇది. ఇదివరకు ‘పుష్ప’లో ఐటెం సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆ తరువాత పూర్తి స్థాయి సినిమా ఇదే. ఇందులో సమంత యాక్షన్ కు బాగా మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో ఆమె ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోతుంది అని అనుకోవచ్చు. దీంతో కొందరు దర్శకులు ఆమెతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ లు ఉండడంతో ప్రేక్షకులు సినిమా ను ఆదరిస్తున్నారు.
సుమారు రూ.40 నుంచి రూ.50 కోట్ల బిజినెస్ తో థియేటర్ లోకి వచ్చిన యశోద ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ దాటింది. అయితే బంపర్ హిట్టు కొడుతున్న ఆశలకు గండి పడింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిగతా ఇండస్ట్రీలోనూ తెలుగు కు సమానంగా కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం సాధారణ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో యశోదను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

samantha
అయితే పెద్ద సినిమాలను థియేటర్ లోకి వచ్చిన తరువాత పది వారాలకు ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నిబంధన ఎవరూ పాటించడం లేదు. థియేటర్ లో కాస్త కలెక్షన్ లు తగ్గాక వెంటనే.. స్మాల్ స్క్రీన్ కు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో యశోదను కూడా నెలరోజుల్లోపే ఓటీటీలోకి తీసుకు రావాలని చూస్తున్నారు. యశోద లో సమంతతో పాటు రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటించారు. సరోగసీ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.