Samantha- Vijay Devarakonda: సమంతకు విజయ్ దేవరకొండతో అందుకే రెండు లిప్ టు లిప్ కిస్ లు పెట్టించాను : డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సమంత విజయ్ దేవరకొండ మధ్య బోల్డ్ సీన్స్ పై ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… కథలో భాగంగానే ఆ సీన్స్ పెట్టామని అన్నారు.

Samantha- Vijay Devarakonda: విజయ్ దేవరకొండ రాను రాను టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీలా తయారవుతున్నాడు. ఆయన సినిమాల్లో లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. అర్జున్ రెడ్డి దగ్గర నుండి చూస్తే… గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఇలా ప్రతి సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ లో అయితే విజయ్ దేవరకొండ-రాశి ఖన్నా రెచ్చిపోయి బెడ్ రూమ్ సన్నివేశాలు చేశారు.
ఇక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్న ఖుషి చిత్రంలో కూడా ఈ తరహా సన్నివేశాలు ఉన్నాయి. సమంత-విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ సీన్స్ లో నటించారు. అలాగే బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. ఆ తరహా సన్నివేశాలు లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలు చేయడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత విజయ్ దేవరకొండ మధ్య బోల్డ్ సీన్స్ పై ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… కథలో భాగంగానే ఆ సీన్స్ పెట్టామని అన్నారు. ఆరాధ్య పాత్రకు ఆ సమయంలో లిప్ లాక్ సీన్ అవసరం. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే ఎమోషన్స్ గురించి చెప్పేటప్పుడు ఆ చిన్న ముచ్చట లేకపోతే ఎలా?. ఆ తరహా సన్నివేశాలు లేకపోతే వారు భార్య భర్త అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. అందుకే శృంగార సన్నివేశాలు పెట్టాను, అని వివరణ ఇచ్చాడు.
ఇక ఖుషి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో సినిమాకు భారీ స్పందన వస్తుంది. విజయ్ దేవరకొండ-సమంత హిట్ కొట్టినట్లే అంటున్నారు. సినిమా నిడివి ఇబ్బంది పెట్టినా కామెడీ, రొమాన్స్ వర్క్ అవుట్ అయ్యాయి. క్లైమాక్స్ ఆకట్టుకున్న నేపథ్యంలో డీసెంట్ టాక్ వినిపిస్తుంది. సాంగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయయని అంటున్నారు.
