Samantha Vijay Devarakonda : సమంత-విజయ్ దేవరకొండ హాట్ సీన్ వైరల్… ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
కాగా సినిమా విడుదలైన రోజే సమంత-విజయ్ దేవరకొండ మధ్య తెరకెక్కిన బెడ్ రూమ్ సన్నివేశాల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Samantha Vijay Devarakonda : ఖుషి చిత్రంలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ జంటకు ప్రేక్షకులు ఫుల్ మార్క్స్ వేస్తున్నారు. ఒకింత శృతిమించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయారు. ఈ సన్నివేశాలపై దర్శకుడు శివ నిర్వాణ వివరణ ఇవ్వడమైంది. కథలో భాగంగానే ఆరాధ్యకు లిప్ లాక్ సన్నివేశాలు పెట్టాను. ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి ఎమోషన్స్ చెప్పేటప్పుడు ఈ తరహా సన్నివేశాలు అవసరం. లేదంటే ప్రేక్షకులకు వాళ్ళు భార్యాభర్తలన్న భావన రాదు అన్నారు.
కాగా సినిమా విడుదలైన రోజే సమంత-విజయ్ దేవరకొండ మధ్య తెరకెక్కిన బెడ్ రూమ్ సన్నివేశాల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బెడ్ రూమ్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భిన్న అభిప్రాయాలు వినిపించాయి. కొందరు జంట క్యూట్ గా ఉన్నారు. వాళ్ళ కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. కొందరేమో… ఇలాంటి సన్నివేశాలు లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలు చేయడా అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఓవర్సీస్ ప్రింట్ లో ఒకటి రెండు అడల్ట్ డైలాగ్స్ కూడా ఉన్నాయని వినికిడి. ఇండియాలో విడుదల చేసిన ప్రింట్ లో వాటిని తొలగించారట. ఏది ఏమైనా విజయ్ దేవరకొండకు హిట్ పడింది. యూఎస్ లో ఖుషి వన్ మిలియన్ వసూళ్ల మార్క్ దాటేసింది. రెండు రోజుల్లో ఖుషి యాభై శాతానికి పైగా రికవర్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సాలిడ్ గా వసూళ్లు ఉండే సూచనలు కలవు.
మైత్రీ మూవీ మేకర్స్ ఖుషి చిత్రాన్ని తెరకెక్కించారు. శివ నిర్వాణ ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఖుషి మూవీ. ఈ చిత్రానికి సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. పరాజయాల్లో ఉన్న సమంత, విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కారు. గతంలో వీరిద్దరూ మహానటి మూవీలో జంటగా నటించారు.
