Samantha: నా జీవితం సంకనాకిపోయింది.. ఇప్పుడు లైఫ్ వరస్ట్.. బరెస్ట్ అయిన సమంత

ఇక మీదట తను చేసే సినిమాలు పూర్తిగా ఇష్టపడితేనే చేస్తానని మొహమాటానికి పోయి సినిమాలు చేయనని చెప్తూనే,తనకి తాను కంఫర్ట్ జోన్ నుంచి దాటుకొని బయటకు వచ్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని చూస్తున్నాను అని చెప్పింది.

  • Written By: V Krishna
  • Published On:
Samantha: నా జీవితం సంకనాకిపోయింది.. ఇప్పుడు లైఫ్ వరస్ట్.. బరెస్ట్ అయిన సమంత

Samantha: ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి నటిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి కోడలు అయిన సమంత.మళ్ళీ చాలా తొందరగానే ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో చైతన్య తో విడాకులు కూడా తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి సూపర్ సక్సెస్ సాధించాయి. అయిన కూడా నిజ జీవితం లో వీరిద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలువ లేదు. రీల్ లో సక్సెస్ అయిన వీళ్ళ జంట రియల్ జీవితం లో మాత్రం ఫెయిల్ అయింది. అయితే సమంత విడాకుల తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటు సూపర్ సక్సెస్ అవుతుంది.అయితే ఆమె విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. దాంతో ఆమె ప్రస్తుతం ఫ్లాప్ ల్లో ఉందనే చెప్పాలి యశోద,శాకుంతలం, ఖుషి మూడు సినిమాలు కూడా ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు తీసే సినిమాల మీద ఆమె ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తుంది. ఇక మయోసైటీస్ కి సంబంధించిన చికిత్స కోసం ఆమె అమెరికాకు వెళ్ళారు. ఇక రీసెంట్ గా ఒక పత్రికతో మాట్లాడిన ఆవిడ జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పారు.

ఇక మీదట తను చేసే సినిమాలు పూర్తిగా ఇష్టపడితేనే చేస్తానని మొహమాటానికి పోయి సినిమాలు చేయనని చెప్తూనే,తనకి తాను కంఫర్ట్ జోన్ నుంచి దాటుకొని బయటకు వచ్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని చూస్తున్నాను అని చెప్పింది. ఇక తనకి యాక్షన్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని అలాంటి సినిమాలు కూడా ఫ్యూచర్ లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా చెప్పింది. అలాగే ప్రస్తుతం ఆవిడ సిటాడెల్ సినిమా చేస్తుంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా అమెరికన్ టీవీ సీరిస్ స్ఫూర్తితో ఇండియా నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈవిడ తనకున్న వ్యాధి పట్ల ధైర్యంగా ముందడుగు వేస్తూ ప్రతి విషయాన్ని చాలా దైర్యం గా ఎదురుకుంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న యువత ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడు ఏది దక్కలేదని భాద పడకండి, ప్రతిక్షణం మీకోసం బతుకుతూ మీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి అంటూ యూత్ కి ఆమె ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు….

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు