Samantha : ఆ స్టార్ హీరో తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమంత.. త్వరలో శుభవార్త వినిపించబోతుందా?
Samantha : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత.సౌత్ లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది, అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ గా నిల్చింది.ప్రస్తుతం ఈమె టైటిల్ పాత్ర పోషించిన ‘శాకుంతలం’ చిత్రం […]

Samantha : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత.సౌత్ లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది, అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ గా నిల్చింది.ప్రస్తుతం ఈమె టైటిల్ పాత్ర పోషించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ బాషలలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆమె ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది.ఇది ఇలా ఉండగా సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.నిన్ను కోరి , మజిలీ మరియు టక్ జగదీశ్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
సమంత కి ‘మయోసిటిస్’ వ్యాధి రావడం వల్ల చాలా కాలం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.మళ్ళీ ఇప్పుడామె బౌన్స్ బ్యాక్ అవ్వడం తో తనకి సంబంధించిన బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు సరికొత్త షెడ్యూల్స్ లో పాల్గొంటుంది.రీసెంట్ గానే ఈ మూవీ టీం లేటెస్ట్ షెడ్యూల్ కోసం కేరళ కి వెళ్ళింది.అక్కడ కొన్ని అందమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ ని జరపబోతున్నారు.
అయితే షూటింగ్ గ్యాప్ లో సమంత తో కలిసి హీరో విజయ దేవరకొండ కేరళలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో తిరుగుతున్న ఫోటోలను సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది.ఈ ఫొటోలో సమంత మేడలో పసుపు తాడు ఉంది, అది చూసిన ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ని పెళ్లి చూసుకున్నావా..?, త్వరలో ఈ శుభవార్త ఎప్పుడు వినిపిస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ అది కేవలం షూటింగ్ లో భాగమే అని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది.