Samantha Kushi Movie: ఇది సమంత రియల్ స్టోరీనేనా.. ఖుషి సినిమాతో నాగచైతన్య డైవర్స్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్..
ఖుషి సినిమా విషయానికి వస్తే.. పైన చెప్పినవన్నీ నిజమే అన్నట్టు ఉండి ఈ సినిమా. సమంత క్రిస్టియన్.. నాగచైతన్య హిందూ.. ఈ సినిమాలో అలా హిందూ.. .క్రిస్టియన్ ..అని పెట్టకుండా దేవుడిని నమ్మే ఫ్యామిలీ.. సైన్సు నమ్మే ఫ్యామిలీ అని పెట్టి వేరువేరు పద్ధతులను చూపించారు.

Samantha Kushi Movie: విజయ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందు నుంచి ఈ సినిమా సమంత, నాగచైతన్య కథ అని రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమా చూస్తే అది నిజమే ఏమో అని చాలామందికి సందేహం రాక మానదు.
కాసేపు ఈ విషయం పక్కన పెడితే చాలా రోజుల క్రితం ఉమైర్ సందు అనే విమర్శకుడు సమంత నాగచైతన్య విడిపోదానికి పిల్లల విషయం కూడా ఒక కారణమని ట్వీట్ చెయ్యడం జరిగింది. కానీ ఈయన చెప్పే మాటలు నమ్మొచ్చో నమ్మకూడదో అని చాలామంది అప్పట్లో దాన్ని పట్టించుకోలేదు.
ఇంకొద్ది రోజుల తర్వాత సమంత.. నాగచైతన్య తో మజిలీ సినిమా తీసిన దర్శకుడు శివ నిర్వాణ తో ఖుషి సినిమా ప్రకటించింది సమంత. ఆ తరువాత సమంత కి ఆరోగ్యం బాగా లేకపోయినా ఈ చిత్రం యూనిట్ సమంత కోసం ఎన్నో రోజులు వెయిట్ చేసింది. ఇక ఈ సినిమా సమంత బయోపిక్ అని .. పిల్లలు.. పద్ధతులు చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది అని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక ఇప్పుడు ఖుషి సినిమా విషయానికి వస్తే.. పైన చెప్పినవన్నీ నిజమే అన్నట్టు ఉండి ఈ సినిమా. సమంత క్రిస్టియన్.. నాగచైతన్య హిందూ.. ఈ సినిమాలో అలా హిందూ.. .క్రిస్టియన్ ..అని పెట్టకుండా దేవుడిని నమ్మే ఫ్యామిలీ.. సైన్సు నమ్మే ఫ్యామిలీ అని పెట్టి వేరువేరు పద్ధతులను చూపించారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు కూడా చూపించారు.
అంతేకాదు పిల్లల కోసం తాపత్రయపడే క్యారెక్టర్ లో సమంతని.. దాన్ని పెద్దగా పట్టించుకోని క్యారెక్టర్ లో విజయ దేవరకొండ ని చూపించాడు. సమంత పిల్లలు కావాలి అనగా అప్పట్లో నాగచైతన్య ఒప్పుకోలేదని అందుకే వీరు విడాకులు తీసుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో సమంత కి అబార్షన్ అయిన తర్వాత నుంచే ప్రాబ్లమ్స్
మొదలవుతాయి…ఉమర్ అప్పట్లో నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయొచ్చారు అనే ఒక ట్వీట్ కూడా పెట్టారు.
ఇక లోపల ఎక్కువ బాధను పెట్టుకొని అన్నిటికీ ఎమోషనల్ అయ్యే క్యారెక్టర్ లో సమంతని.. వేటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగే క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ ని చూపించారు. మనం రియల్ లైఫ్ లో చూస్తే కూడా సమంత కొంచెం ఎమోషనల్ గా నాగచైతన్య ప్రాక్టికల్ గా కనిపిస్తూ ఉంటారు.
కానీ ఇది సినిమా కాబట్టి ఫైనల్ గా విజయ్ దేవరకొండ సమంతని అర్థం చేసుకున్నట్టు చూపించాడు. కాగా రియల్ లైఫ్ లో మాత్రం ఇలా జరగలేదు నాగచైతన్య.. సమంత డైవర్స్ తీసుకున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. ‘మేము అమ్మాయిలం విప్లవ్.. నాన్నకి ..భర్తకి చెప్పుకోలేనిది దేవుడికి చెప్పుకుంటాము’ అని.. సమంత డైవర్స్ తర్వాత నుంచి ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ.. దేవుడిని సందర్శిస్తూ కూడా కనిపించింది.. మొత్తానికి ఖుషి సినిమాలో ఏదో ఒక పాయింట్ మీడియాలో వచ్చే ఏదో ఒక రూమర్ తో కనెక్ట్ అయ్యే ఉంది.
మరో విషయం ఏమిటి అంటే డైవర్స్ తర్వాత నుంచి సమంతా తీసే ప్రతి సినిమా.. యశోద .. శాకుంతలం ..ఇప్పుడు ఖుషి అన్నీ కూడా ప్రెగ్నెన్సీ చుట్టూనే తిరుగుతున్నాయి. మరి సమంత కావాలని ఇలాంటి సినిమాలు ఎంచుకొని తన బాధను చెప్పడానికి తీస్తోందా అనేది తెలియాల్సిన విషయం. ఇక నిజంగా ఇదంతా నిజమేనా కాదా అనేది మాత్రం సమంతనే చెప్పాలి.
