Samantha: అవి పెంచడం కోసం సమంత హార్ట్ వర్క్… మామూలు కష్టం కాదు!

ప్రస్తుతం ఆమె రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. సిటాడెల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

  • Written By: SRK
  • Published On:
Samantha: అవి పెంచడం కోసం  సమంత హార్ట్ వర్క్… మామూలు కష్టం కాదు!

Samantha: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. అలాగే నిరంతరం శ్రమించాలంటే ఎనర్జీ, ఫిట్నెస్ కూడా ఉండాలి. సమంత ఈ విషయంలో వెరీ సీరియస్. ఆమె దినచర్యలో వ్యాయామం కచ్చితంగా ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగాన్ని అందంగా ఉంచుకునేందుకు ఒక్కో వ్యాయామం చేస్తారు. సమంత తన కాళ్ళ పిక్కలను(కాఫ్ మజిల్) ధృడంగా, మంచి షేప్ లోకి మార్చుకోవడానికి స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఏకంగా వంద రిపీట్స్ చేసిందట. వందసార్లు చేశాక విపరీతమైన నొప్పితో బాధపడ్డట్లు వెల్లడించింది.

జిమ్ లో సమంత డెడికేషన్ చూసిన జనాలు వావ్ అంటున్నారు. సమంత హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగిన అమ్మాయని ఇప్పటికే రుజువైంది. ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే శాకుంతలం బిగ్ షాక్ ఇచ్చింది. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా శాకుంతలం రికార్డులకు ఎక్కింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం ఆడియన్స్ కి ఎక్కలేదు. సీరియల్ ని తలపించే గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే ఇబ్బంది పెట్టిందన్నారు. శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత స్పందించడం విశేషం.

ప్రస్తుతం ఆమె రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. సిటాడెల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ కోసం సమంత తీవ్రంగా కష్టపడుతున్నారు. కఠిన యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఖుషి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రోమోలు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఖుషి చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. అలాగే సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. చెన్నై స్టోరీ టైటిల్ తో ఫిలిప్ జాన్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నారట వివేక్ కాల్రా హీరోగా నటించనున్నాడట. చెన్నై అమ్మాయికి లండన్ అబ్బాయికి మధ్య నడిచే ప్రేమ కథ అని సమాచారం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు