Samantha- Virat Kohli: ఆ రోజు విరాట్ కోహ్లీని చూసి ఏడ్చేశాను.. స్టార్ క్రికెటర్ అంటే సమంతకు అంత ఇష్టమా!
విరాట్ చేసిన 71వ సెంచరీ చాలా స్పెషల్ అని ఆమె చెప్పుకొచ్చారు. ముప్పేట దాడి జరుగుతున్నా ఆయన తిరిగి ఫార్మ్ లోకి వచ్చిన తీరు అద్భుతమని సమంత పరోక్షంగా చెప్పారు.

Samantha- Virat Kohli: స్టార్ లేడీ సమంత విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తుంది. ఖుషి బ్యూటీ లేటెస్ట్ ఇంటర్వ్యూ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తన అభిమానం చాటుకున్నారు. ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ-సమంత స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత, విజయ్ దేవరకొండ తమకు ఇష్టమైన స్పోర్ట్స్, ప్లేయర్స్ ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు. సమంత మాట్లాడుతూ… స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఆయన నాకు స్ఫూర్తి అన్నారు. విరాట్ ఫార్మ్ కోల్పోయి సతమతమవుతున్న దశలో విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఆయన భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆ రోజు నేను ఏడ్చేశాను.
విరాట్ చేసిన 71వ సెంచరీ చాలా స్పెషల్ అని ఆమె చెప్పుకొచ్చారు. ముప్పేట దాడి జరుగుతున్నా ఆయన తిరిగి ఫార్మ్ లోకి వచ్చిన తీరు అద్భుతమని సమంత పరోక్షంగా చెప్పారు. క్రికెటర్ ధోని కూడా సమంతకు ఇష్టమట. ఇక ఐపీఎల్ లో తన ఫేవరేట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ అట. తన మద్దతు ఆ టీమ్ కే అని ఆమె చెప్పుకొచ్చారు. చెన్నై భామగా సమంత తన హోమ్ టీమ్ కి సప్పోర్ట్ చేశారు.
మజిలీ సినిమాలో సమంత మాజీ భర్త నాగ చైతన్య క్రికెటర్ రోల్ చేశారు. ఆ మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం ఆమెతో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఖుషి చిత్ర పోస్టర్స్, ప్రోమోలు ఆకట్టుకుంటున్న తరుణంలో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో సమంత లవ్ ఎంటర్టైనర్స్ చేయలేదు. కాబట్టి ఆమె ఫ్యాన్స్ కి ఖుషి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. మరోవైపు విజయ్ దేవరకొండ ఈ చిత్ర విజయం పై విశ్వాసంతో ఉన్నారు.
ఖుషి సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సమంత సిటాడెల్ యాక్షన్ సిరీస్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సిరీస్లో సమంత హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు శృంగార సన్నివేశాల్లో కూడా నటించనున్నట్లు సమాచారం. సిటాడెల్ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం కలదు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఇది తెరకెక్కుతుంది.
Samantha Prabhu said “Virat Kohli is an inspiration, I almost cried when he made the comeback & scored the hundred”. [Star] pic.twitter.com/U1aDFYbtlT
— Johns. (@CricCrazyJohns) May 12, 2023
