Actress Samantha: ఆ విషయంలో సెంచరీ కొట్టిన సమంత… ఏంటంటే?

Actress Samantha: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ […]

Actress Samantha: ఆ విషయంలో సెంచరీ కొట్టిన సమంత… ఏంటంటే?

Actress Samantha: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి.

Actress Samantha

Actress Samantha

శ్రీవల్లీ, ఏయ్ బిడ్డా, నా సామి, దాక్కో దాక్కో మేక ఇలా పుష్ప సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే. అయితే చివరిగా వచ్చినా “ఊ అంటావా మావా లేక… ఊహూ అంటావా మావా అంటూ ఓ ఊపు ఊపింది సమంత. ఈ పాటకు చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ ఇంద్రావతి ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరూ ఈ పాటకు ఫిదా అయిపోయారు. సమంత చేసిన మొదటి ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం.

ఈ పాట వివాదాస్పదమే కాకుండా పేరడీలకు కూడా బాగానే ఉపయోగపడింది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అవుతోన్న ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరవుతుందో… దీనికి పేరడిగా వస్తోన్న పాటలూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. తాజాగా యూట్యూబ్‌లో కొత్త రికార్డును సృష్టించింది ఈ పాట. డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ పాట ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. కేవలం 20 రోజుల్లోనే ఈ రికార్డును నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి. దీంతో సామ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్ ఇంటర్వెల్ కాదు, ఆ సీక్వెన్సే !

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు