Samantha: సమంత రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఫైటరే

ముందుగా ఈ హీరోయిన్ చిన్నప్పుడు విశేషాలు తీసుకుంటే…సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేవలం 100 రూపాయలు పాకెట్ మనీ కోసం రోజంతా.. ఫంక్షన్స్ ముందు పన్నీరు చల్లే అమ్మాయిగా నిలుచుకునే దానిని చెప్పుకొచ్చింది.

  • Written By: SRK
  • Published On:
Samantha: సమంత రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఫైటరే

Samantha: సమంత.. ఈ పేరు వినగానే తెరపైనే కాదు తెర వెనుక విశేషాలు కూడా గుర్తొస్తాయి. ఏం మాయ చేసావే సినిమాతో మనకు పరిచయమై అందరిని తన మాయలోకి దింపేసింది ఈ హీరోయిన్.

ఏదో ఒకటి రెండు సినిమాలో కనిపించి వెళ్ళిపోతుందేమో అనుకుంటే.. ఏకంగా 13 సంవత్సరాల పాటు మనల్ని తన మాయలోనే పెట్టుకుంది. సమంత ఏం మాయ చేసావే సినిమా 2010లో విడుదలైంది. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు సమంత తెర పైన ఎన్నో పాత్రలనే కాదు తెర వెనుక ఎన్నో కష్టాలను కూడా చవిచూస్తూ వచ్చింది.

ముందుగా ఈ హీరోయిన్ చిన్నప్పుడు విశేషాలు తీసుకుంటే…సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేవలం 100 రూపాయలు పాకెట్ మనీ కోసం రోజంతా.. ఫంక్షన్స్ ముందు పన్నీరు చల్లే అమ్మాయిగా నిలుచుకునే దానిని చెప్పుకొచ్చింది. కానీ అలాంటి సమంత ప్రస్తుతం ప్రత్యూష ఫౌండేషన్ అని స్వచ్ఛంద సంస్థ నడుపుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ప్రత్యూష అనేది సమంత ఫ్రెండ్ పేరంట. మరి వంద రూపాయల పాకెట్ మనీ గురించి ఆలోచించే అమ్మాయి నుంచి కోట్ల రూపాయలు సంపాదించే అమ్మాయి వరకు సమంత ఎదిగింది అంటే అది ఆమె కష్ట ఫలితం అని చెప్పొచ్చు.

సమంత విభిన్న పాత్రలు చేసింది అనడం కన్నా.. ఆమె చేసిన ప్రతి పాత్రకు ఆమె వందశాతం ఇచ్చింది అనడం కరెక్ట్. తాను చేసిన ప్రతి సినిమాలో ఆమె నటన పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఈ మధ్యనే ఆమె 37వ పుట్టినరోజు ఒక పోస్ట్ వేస్తూ 16 నుంచి 36 వరకు ఎన్నో కష్టాలు చూసాను అని రాసుకొచ్చింది. ఇక సమంత గురించి తెలిసిన వారు ఎవరైనా ఈ మాట నమ్మక తప్పదు. స్టార్ హీరోయిన్ అయింది తనకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటారేమో…డెస్టినీ నో లేకపోతే తనకు తాను రాసుకున్న రాటో తెలియదు కానీ.. మొత్తానికి కష్టాలకి కేరాఫ్ అడ్రస్ గా మాత్రం మారింది ఈ హీరోయిన్.

మొదటగా జబర్దస్త్ సినిమా టైంలో సమంత ..సిద్ధార్థ ప్రేమించుకున్నారు అనే వార్త చెక్కర్లు కొట్టింది. ఇక అది నిజమే అన్నట్టు వీరిద్దరూ కాళహస్తిలో పూజలు కూడా చేశారు. కానీ సిద్ధార్థ గురించి ఒక విషయం అందరికీ తెలిసిందే. అదేమిటి అంటే ఆయన ఇప్పటికే దాదాపు నలుగురు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చారని. మరి జెమినీ గణేషన్ ని సావిత్రి ప్రేమించినట్టు సమంత ..సిద్ధార్థ ని ప్రేమించిందో ఏమో తెలియదు కానీ.. సావిత్రి గారు చేసిన తప్పు మాత్రం సమంత చేయలేదు. అదేమిటి అంటే సిద్ధార్థ ని ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదు. సిద్ధార్థ ప్రేమలో నుంచి త్వరగానే బయటపడి తన కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంది.

ఇక అప్పుడు తనకు ఏం మాయ చేసావే సినిమా దగ్గర నుంచి మంచి ఫ్రెండ్ అయినా నాగచైతన్యాన్ని ప్రేమించింది. కానీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఎన్నో ట్రొల్ల్స్ వచ్చాయి. కాని అక్కడ అర్థం కావలసిన విషయం ఏమిటి అంటే…సిద్ధార్థ ఎంతో మంది అమ్మాయిలను ప్రేమించారు అనే రూమర్ ఉంది…మరి అక్కడ సిద్ధార్థ ని ఏమీ అనకుండా ఎందుకు సమంత పైనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో.. పెట్టిన వాళ్లకే తెలియాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే తరువాత కొద్ది రోజులకి నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుంది సమంత.

ఇక అంతా మంచే అనుకుంటున్నా టైంలో అంతా మనం అనుకున్నట్టు జరగదు కదా అనేది కూడా అర్థమైంది. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయారు ఈ జంట. కాగా ఇక్కడ కూడా సోషల్ మీడియాలో సమంత పైనే నెగటివ్ పోస్టులు వేయడం ప్రారంభించారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఎవరికీ తెలియదు అయినా కానీ సమంతనే అందరూ నిందించారు. కనీసం కొద్దిమంది కూడా నిజంగానే నాగచైతన్య వైపు, లేదా ఇద్దరు వైపు నుంచి తప్పుందేమో అని ఆలోచించలేదు.

ఇక వెంటనే పుష్పా లో ఐటమ్ సాంగ్ చేసింది ఈ హీరోయిన్. కొంతమందికి ఎవరి పైనన ఎక్కువ కోపం ఉంటే.. వారిపై చూపించడం కాకుండా తమ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం ఇష్టం. లేదా పంతానికి పోవడం ఇష్టం. ఈ రెండిట్లో ఏదో ఒక సిద్ధాంతాన్ని సమంతా నమ్ముతుంది.. అందుకే ఆ బాధని లేదా కోపాన్ని ‘ఊ అంటావా మామ’ చేసి తీర్చుకునిందేమో. కానీ దీనిపైన కూడా సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఇక తరువాత అనారోగ్యానికి గురైన సమంత చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ వచ్చినా కానీ తన పెండింగ్ ఉండే ప్రాజెక్టుల వరకు చేసి మళ్లీ కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంటాను అని విదేశాలకు వెళ్ళిపోయింది. అంతే కాదు ఖుషి సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేదని తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ నుంచి కోటి రూపాయలు వెనక్కి కూడా ఇచ్చేసిందంతా ఈ హీరోయిన్.

ఇక ప్రస్తుతం కొన్ని ప్రోగ్రామ్స్ లో సమంత ని చూస్తే తాను తన మయోసైటిస్‌ అనే వ్యాధితో చాలా సఫర్ అవుతుంది అన్న సంగతి అర్థమవుతోంది. కాగా ఇక్కడ ఆ అనారోగ్యం గురించి ఎవరు ఆలోచించడం లేదు.. తాను ఈ మధ్య వచ్చిన సినిమాల్లో తన డ్రస్సుల గురించి, తాను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోల గురించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. సమంత వృత్తి నటన. తాను ఒక హీరోయిన్. అలాంటప్పుడు తన డ్రస్సులు తన సీన్లు గురించి అంత పర్సనల్ గా తీసుకోవడం అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సావిత్రి ..సౌందర్య ..సాయి పల్లవి లాగా ఉండటం కూడా కుదరదు.

కానీ ఇదే పాయింట్ మీద సోషల్ మీడియాలో తెగ నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు మన నెటిజన్స్. నిజంగా సమంత పైన సోషల్ మీడియాలో ఎందుకు ఇంత నెగెటివిటియో ఎవరికీ అర్థం కాదు. కాగా ఇవన్నీ సమంత దాటుకొని ఇంకా కూడా ఎంతో ధైర్యంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది..

దీంతోనే చెప్పొచ్చు సమంత రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఫైతరే.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు