Samantha: లండన్ అబ్బాయి ప్రేమలో సమంత… ఇప్పుడిదే హాట్ న్యూస్!

దాదాపు ఐదు నెలలు సమంత షూటింగ్స్ కి దూరమయ్యారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగైన వెంటనే పనిలో బిజీ అయ్యారు. గతంలో కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ చిత్ర షూటింగ్స్ లో ఆమె పాల్గొంటున్నారు.

  • Written By: SRK
  • Published On:
Samantha: లండన్ అబ్బాయి ప్రేమలో సమంత… ఇప్పుడిదే హాట్ న్యూస్!

Samantha: సమంత గత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారు. భర్త నాగ చైతన్యతో విడాకులు ఆమెను మానసిక వేదనకు గురి చేశాయి. ఈ డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంతకు చాలా సమయమే పట్టింది. ఆ సమస్య తొలగిందో లేదో మరో సమస్య ఆమెను వెంటాడింది. గత ఏడాది చివర్లో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు వెల్లడించింది. ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సన్నిహితులు, చిత్ర వర్గాలు ఆమె త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.

దాదాపు ఐదు నెలలు సమంత షూటింగ్స్ కి దూరమయ్యారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగైన వెంటనే పనిలో బిజీ అయ్యారు. గతంలో కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ చిత్ర షూటింగ్స్ లో ఆమె పాల్గొంటున్నారు. ఖుషి మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

ఇక సిటాడెల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్. హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. సిటాడెల్ కోసం సమంత చాలా కష్టపడుతున్నారు. డూప్ లేకుండా కఠిన యాక్షన్ స్టంట్స్ చేస్తున్నారు. షూటింగ్ లో తన చేతులకు అయిన గాయాలను కూడా సమంత చూపించారు. ఇదిలా ఉంటే సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారన్న వార్త హాట్ టాపిక్ అవుతుంది.

చెన్నై స్టోరీ టైటిల్ తో ఓ ఆంగ్ల చిత్రం తెరకెక్కనుందట. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ గా సమంత ఎంపికయ్యారట. ఇది లండన్ అబ్బాయికి చెన్నై అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అట. హీరోగా హాలీవుడ్ నటుడు వివేక్ కాల్రా నటిస్తున్నారట. దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్నారట. అధికారిక ప్రకటన చేయాల్సింది ఉండగా ఈ మేరకు సమాచారం అందుతుంది. కాబట్టి సమంత రేంజ్ టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ పాకిందన్న మాట. సమంత పనైపోయిందన్న వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి పరిణామం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు