తమన్నాపై సమంత హాట్ కామెంట్

మిల్కీ బ్యూటీ తమన్నాపై అక్కినేని సమంత హాట్ కామెంట్ చేసింది. తమన్నా తెరపై ఉంటే అభిమానులు చూపు తిప్పుకోలేరని, ఆమె ఓ టపాకయ్.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సమంత ట్వీట్ చేసింది. తమన్నా వెండితెరకు పరిచయమై 15వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమన్నాకు హీరోయిన్ సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టు పెట్టింది. ఓ బాలీవుడ్ సినిమాతో తమన్నా సినీరంగంలోకి ప్రవేశించింది. బుధవారంతో తమన్నా 15ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. తమన్నా […]

  • Written By: Neelambaram
  • Published On:
తమన్నాపై సమంత హాట్ కామెంట్

మిల్కీ బ్యూటీ తమన్నాపై అక్కినేని సమంత హాట్ కామెంట్ చేసింది. తమన్నా తెరపై ఉంటే అభిమానులు చూపు తిప్పుకోలేరని, ఆమె ఓ టపాకయ్.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సమంత ట్వీట్ చేసింది. తమన్నా వెండితెరకు పరిచయమై 15వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమన్నాకు హీరోయిన్ సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టు పెట్టింది.

ఓ బాలీవుడ్ సినిమాతో తమన్నా సినీరంగంలోకి ప్రవేశించింది. బుధవారంతో తమన్నా 15ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. తమన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది మెప్పించింది. ‘శ్రీ’ మూవీతో తమన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీలో మంచు మనోజ్ కు జోడీగా నటించి మెప్పింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీ తమన్నా కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో తమన్నా వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఇటీవల మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’లో ‘లక్ష్మీ’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

తమన్నాకు కుర్రకారులో భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అందం, అభినయంతోపాటు మాస్ స్టెప్పులతో తమన్నా అగ్ర కథానాయికగా ఎదిగింది. తమన్నాపై మరో హీరోయిన్ సమంత తన ప్రేమను చాటుకుంది. ‘15 అద్భుతమైన సంవత్సరాలు.. అందం, కష్టించేతత్వం, నిజాయితీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో తమన్నా ఒకరని కితాబిచ్చింది. స్క్రీన్‌పై ఆమె ఓ టపాకాయ్.. ఆమె నుంచి మీ చూపును తిప్పుకోలేరు.. కంగ్రాట్స్ డార్లింగ్` అంటూ సమంత ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు తమన్నా స్పందిస్తూ `సమంత నా ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. పాత్రలను నువ్వు ఎంచుకునే విధానం, వాటిని తెరపై పోషించే తీరు నాకెంతో స్ఫూర్తిని కలిగిస్తాయి` అంటూ తమన్నా రీట్వీట్ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు తమ ఇష్టాన్ని, ప్రేమను చాటుకోవడం వారి మధ్య ఉన్న స్నేహానికి అద్దం పడుతుంది.

సంబంధిత వార్తలు