Samantha: సమంత ఇలా అయిపోయిందేంటి! మయోసైటిస్ వల్లనేనా? షాకింగ్ లుక్ వైరల్
Samantha: దాదాపు రెండు నెలల తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. ఆమె నటించిన శాకుంతలం మూవీ ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. ఆమె ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. షూటింగ్స్ కి సైతం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నా… సమంత ప్రస్తుతం ఎలా ఉన్నారనేది ఫ్యాన్స్ కి తెలియదు. నేడు ఆమెను చాలా దగ్గరగా చూసే ఛాన్స్ వచ్చింది. ఈ ప్రెస్ […]

Samantha: దాదాపు రెండు నెలల తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. ఆమె నటించిన శాకుంతలం మూవీ ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. ఆమె ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. షూటింగ్స్ కి సైతం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నా… సమంత ప్రస్తుతం ఎలా ఉన్నారనేది ఫ్యాన్స్ కి తెలియదు. నేడు ఆమెను చాలా దగ్గరగా చూసే ఛాన్స్ వచ్చింది.

Samantha
ఈ ప్రెస్ మీట్లో సమంత ఎమోషనల్ అయ్యారు. గుణశేఖర్ ఆమెను పొగుడుతుంటే సమంత కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కేవలం గుణశేఖర్ కోసం ఓపిక చేసుకొని ఈ ప్రెస్ మీట్ కి వచ్చానని సమంత అన్నారు. అందరికీ సినిమా జీవితంలో ఒక భాగం, కానీ గుణశేఖర్ కి సినిమానే జీవితం. ఈ సినిమాను ఆయన ప్రాణం పెట్టి తీశారు. రేపు సినిమాను ఆదరించి శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి అన్నారు. సమంత మాట్లాడేందుకు కొంచెం ఆయాస పడ్డారు. ఆది టెన్షన్ వల్ల కూడా కావచ్చు. ఆమె చేతిలో ఒక జపమాల ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఆమె అది ఉపయోగిస్తారనిపిస్తుంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఇక సమంత ఫేస్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమెకున్న సమస్య కనిపించకుండా హెవీగా మేకప్ తో కవర్ చేస్తున్నారనిపిస్తుంది. ట్రీట్మెంట్ కారణంగా ఆమె సన్నబడ్డారు. లుక్ అటుంచితే… మునుపటి జోష్ ఆమెలో లేదు. గతంలో సమంత చాలా ఎనర్జిటిక్ గా ఉండేవారు. మీడియా సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పారు. ఆమె స్పీచ్లో సెటైర్స్, పంచ్లు కూడా ఉండేవి. మునుపటి ఆ సమంత కనిపించ లేదు.

Samantha
అయితే సమంత కోలుకున్నారని విశ్వసనీయ సమాచారం. సమంత షూట్స్ లో పాల్గొనేందుకు ఇంకా సమయం పడుతుంది. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో సమంత ఖుషి చిత్ర షూటింగ్ లో పాల్గొంటారట. ఆల్రెడీ 80 శాతం షూటింగ్ పూర్తి కాగా మిగిలిన పార్ట్ కంప్లీట్ చేస్తారట. అలాగే ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే లతో సిటాడెల్ సిరీస్ చేయనున్నారు. కాగా శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
