
Samantha
Samantha: సమంత జీవితం ఒక్కసారిగా తారుమారైంది. మూడు నెలల క్రితం, సమంత ఎక్కడికి వెళ్లినా ఆమెకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండేవి. అదేంటో చైతుతో విడాకుల అనంతరం సామ్ కు ఆ ప్రత్యేక ఆహ్వానాలు ఆగిపోయాయి. ఇంతకుముందు ప్రముఖులు తనతో చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇప్పుడు వారంతా అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఒక సాధారణ హీరోయిన్ లాగానే తనను ట్రీట్ చేస్తున్నారు.. ఇప్పుడు ఈ అంశాలే సమంతను ఎక్కువ బాధ పెడుతుంది.
సరే.. జీవితంలో జరిగిన మార్పులను, వచ్చిన పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడమే తనకు తెలుసు అని, పోయిన విలువను ఇమేజ్ ను త్వరలోనే సాధిస్తాను అని, పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగి, అప్పుడు సమంత(Samantha) అంటే ఏమిటో చూపిస్తాను అని సామ్ పట్టుదలగా ఉందట. అందుకే, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ ను టార్గెట్ చేస్తోంది. నిజానికి చాలా నెలల క్రితమే సమంత ముంబైలో ఒక పీఆర్ ఏజెన్సీ ని పెట్టుకుంది.
తన గురించి బాలీవుడ్ లో ఫుల్ ప్రమోషన్స్ చేయడానికి ఆ పీఆర్ టీమ్ ను హైర్ చేసుకుంది. అందుకే, సమంతకు సంబంధించిన వార్తలు ఈ మధ్య బాలీవుడ్ లో కూడా ఎక్కువగా పబ్లిష్ అవుతూ వస్తున్నాయి. కారణం ఆమె పెట్టుకున్న పీఆర్వో టీమ్ కారణంగానే. ఇప్పటికే నేషనల్ స్టార్ ప్రభాస్, అలాగే రామ్ చరణ్, చివరకు విజయ్ దేవరకొండ, రష్మికలు కూడా ముంబైకి చెందిన కొంతమంది పీఆర్వోలను పెట్టుకున్నారు.
తమ గురించి ఫుల్ పబ్లిసిటీ చేయించుకోవడానికి వాళ్లు బాగానే చెల్లిస్తున్నారు. ఇప్పుడు సమంత కూడా బాలివుడ్ లో పబ్లిసిటీ కోసం బాగానే ఖర్చు పెడుతుంది. ఎప్పుడైతే, నాగ చైతన్య సమంత నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాడో.. ఆ రోజు నుంచే సమంత బాలీవుడ్ మార్కెట్ వైపు చూసింది. ఈ క్రమంలోనే ఆమె కొంతమంది బాలీవుడ్ దర్శక నిర్మాతలను పర్సనల్ గా వెళ్లి కలిసింది.
దాంతో సామ్ కి కొన్ని హిందీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత ఖాతాలో ఆల్ రెడీ ఒక హిందీ సినిమా పడింది. కాకపోతే.. ఆ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు అనుకోండి. బాలీవుడ్ లో ఎలాగైనా స్టార్ అవ్వాలని, అందుకోసం ఎలాంటి పాత్రలు అయినా చేయాలని సమంత నిర్ణయించుకుందట. అంటే బాలీవుడ్ లో కొత్త బోల్డ్ సమంతను చూడబోతున్నామని పుకార్లు మొదలైయ్యాయి.