Samantha – Allu Arha : ‘అల్లు అర్హ చెప్పిన భారీ డైలాగ్స్ కి నా మైండ్ బ్లాక్ అయ్యింది’ అంటూ సమంత షాకింగ్ కామెంట్స్

Samantha – Allu Arha : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’.ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకుంది.అయితే VFX మీద ఎక్కువ వర్క్ చెయ్యాల్సి రావడం తో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మహాభారతం ప్రారంభం అయ్యే ముందు శకుంతల […]

  • Written By: Naresh
  • Published On:
Samantha – Allu Arha : ‘అల్లు అర్హ చెప్పిన భారీ డైలాగ్స్ కి నా మైండ్ బ్లాక్ అయ్యింది’ అంటూ సమంత షాకింగ్ కామెంట్స్

Samantha – Allu Arha : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’.ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకుంది.అయితే VFX మీద ఎక్కువ వర్క్ చెయ్యాల్సి రావడం తో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మహాభారతం ప్రారంభం అయ్యే ముందు శకుంతల – దుశ్యంత మహారాజు మధ్య జరిగిన ప్రేమాయణం, ఆ తర్వాత దాని వల్ల ఎదురైనా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ గుణ శేఖర్.ఇందులో శకుంతల పాత్ర సమంత చేసింది.ఎల్లప్పుడూ వైవిధ్య భరితమైన పాత్రలను చెయ్యడానికి అమితాసక్తిని చూపించే సమంత, ఈ సినిమాలో కూడా అద్భుతమైన నటన కనబర్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రొమోషన్స్ అప్పుడే ప్రారంభం అయిపోయాయి.

ఈ సందర్భంగా సమంత వరుసగా ఈ సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇవ్వడం ప్రారంభించింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు ‘అల్లు అర్హ’ భరతుడి పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా సమంత అర్హ గురించి మాట్లాడుతూ ‘అల్లు అర్హ మాట్లాడే తెలుగు ని చూసి ఆశ్చర్యపోయాను..ఈమధ్య కాలం లో చిన్నపిల్లలకు పెరిగే వాతావరణం ని బట్టి వాళ్లకి తెలియకుండానే ఇంగ్లీష్ అలవాటు అయిపోతుంది, కానీ ఈ అమ్మాయి నోటి నుండి ఒక్క పదం కూడా ఇంగ్లీష్ రావడం నేను వినలేదు.ఆ అమ్మాయిని అల్లు అర్జున్ స్నేహ అంత చక్కగా పెంచారు.షూటింగ్ లో కూడా ఆ అమ్మాయికి భారీ భారీ డైలాగ్స్ ఉన్నాయి, వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్స్ మధ్య నిల్చొని ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద డైలాగ్స్ చెప్పడం చూసి షాక్ కి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

సంబంధిత వార్తలు