Salaar: Part 1 – Ceasefire : టాలీవుడ్ కి పెద్ద తలనొప్పిగా మారిన సలార్..

కాబట్టి సెప్టెంబర్ కాకుండా ఇంకా ఏ నెలలో సలార్ విడుదల చేసిన టాలీవుడ్ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగానే మారనుండి.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Salaar: Part 1 – Ceasefire : టాలీవుడ్ కి పెద్ద తలనొప్పిగా మారిన సలార్..

Salaar: Part 1 – Ceasefire : మనం ఏ హీరో అభిమాని అయినా అయి ఉండొచ్చు.. కానీ ప్రభాస్ ని మాత్రం తప్పక ఇష్టపడుతాం. దానికి ముఖ్య కారణం స్క్రీన్ బయట ఆయన డార్లింగ్ లాగా ఉంటే ..స్క్రీన్ లో డైనోసర్ లాగా కనిపించి మనల్ని మెప్పించడం. తెలుగు సినిమా ఖ్యాతిని తన సినిమా బాహుబలి తో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ హీరో ప్రస్తుతం వరస పెట్టి పాన్ ఇండియా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.

ముఖ్యంగా ఈ హీరో ప్రశాంతి నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు ఒక కారణం ఈ సినిమాలో హీరో ప్రభాస్ కాగా మరో కారణం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుందేది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబట్టి. వీరిద్దరి కాంబినేషన్ రికార్డ్ సృష్టిస్తుంది అని ప్రతి ప్రేక్షకుడు నమ్ముతున్నాడు.

ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ కి పెద్ద తలనొప్పిగా మారింది. రికార్డులు బద్దల కొడుతుంది అనే నమ్మకం ఉన్న సినిమా తలనొప్పిగా మారటం ఏమిటి అనుకుంటున్నారా…అది ఎందుకు అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ వల్ల.

ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28 విడుదల చేయాలి అనుకున్నారు. దానికి తగ్గట్టే ఎంతోమంది చిన్న చిత్రాల నిర్మాతలు అలానే మీడియం బడ్జెట్ నిర్మాతలు వారి వారి సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. సలార్ సినిమా టైం కి వారి సినిమాలు రిలీజ్ చేయడం సేఫ్ కాదని.. రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.

కానీ ఇప్పుడు కొన్ని కారణాలవల్ల సలార్ సినిమా పోస్ట్ పోన్ కావస్తోంది. ఇంకా రిలీజ్ డేట్ ఏంటో యూనిట్ ఖరారు చేయలేదు. కానీ నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కావచ్చని వినికిడి. ఇది కానీ జరిగితే తమ సినిమాలపై ఆశలు పెట్టుకొని నవంబర్.. డిసెంబర్ లో విడుదల చేద్దామనుకున్న నిర్మాతల పరిస్థితి ఏమిటి. పోనీ సలార్ జనవరిలో రిలీజ్ అయితే ఏమవుతుంది అనుకుంటే.. అప్పుడు ఇంకా పెద్ద తలనొప్పి రావచ్చు. ఎందుకంటే సంక్రాంతికి నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అలానే విజయ్ దేవరకొండ లాంటి టైర్ 2 హీరోలు తమ సినిమాలతో సిద్ధంగా ఉన్నారు.

కాబట్టి సెప్టెంబర్ కాకుండా ఇంకా ఏ నెలలో సలార్ విడుదల చేసిన టాలీవుడ్ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగానే మారనుండి.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు