Salaar postponement : సలార్ వాయిదా… కొత్త రిలీజ్ డేట్ ఇదే!
చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ, సోషల్ మీడియా లో సలార్ వాయిదా అని గట్టిగా ప్రచారం నడుస్తోంది.

Salaar postponement : ప్రభాస్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా సినిమా సలార్. పాన్ ఇండియా సినిమా అని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా అనే చెప్పాలి. ఈ సినిమా మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 28 న సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ, ఈ సినిమా వాయిదా పడిందనే మాటలు వినిపిస్తున్నాయి.
చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ, సోషల్ మీడియా లో సలార్ వాయిదా అని గట్టిగా ప్రచారం నడుస్తోంది. దీనితో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. కనీసం ఎప్పుడు వస్తుందో దాని గురించి అయిన క్లారిటీ ఇవ్వండని అభిమానులు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వలన బాగా ఆలస్యం అవుతుంది. అందుకే ముందుగా అనుకున్న డేట్ కి రాలేకపోతుంది. నవంబర్ లో సలార్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. దీంతో ఇక సలార్ వచ్చేది నవంబర్ లోనే అని అభిమానాలు ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చింది ఆదిపురుష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. నిజం చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి రేంజ్ హిట్ అయితే రాలేదు.
దీంతో సలార్ ఎలాగైనా ఆ లోటును తీరుస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా పోస్టుపోన్ అవుతూనే ఉంది. మరోపక్క ఇలా వాయిదా పడటానికి పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే కాదని, సినిమా బిజినెస్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. సలార్ సినిమా ఓటీటీ రైట్స్ ఇంతవరకు అమ్ముడు కాలేదని తెలుస్తుంది. ఇలాంటి పెద్ద సినిమాలు కొనే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు 100 కోట్లు పైబడిన సినిమాలు కొనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
అందుకే సలార్ ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడు కాలేదని తెలుస్తుంది. ఆ విషయం తేలేవరకు సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా లేరు. అందువలనే ఇలా వాయిదా పడిందని తెలుస్తుంది. మరి నవంబర్ నాటికి ఇవన్నీ సెట్ అయ్యి సలార్ విడుదల అవుతుందో లేదో చూడాలి.
#BreakingNews…
PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms – the producers – are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5— taran adarsh (@taran_adarsh) September 2, 2023
