Venkatesh Saindhav: యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఒక్కో ప్రాజెక్ట్ తో తన ఫేమ్ నేమ్ పెంచుకుంటూ పోతున్నాడు. శైలేష్ మూడో చిత్రంగా సైంధవ్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే సైంధవ్ పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సైంధవ్ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా కొత్తగా ఉన్నాయి. వెంకీ నుండి ఇది ఊహించని యాంగిల్. ఈ తరహా యాక్షన్ థ్రిల్లర్స్ వెంకీ వదిలేసి చాలా కాలం అవుతుంది. దశాబ్దాల తర్వాత ఆయన గన్ పట్టారు.

Venkatesh Saindhav
టైటిల్ లోనే దర్శకుడు తన ప్రత్యేకత చాటుకున్నారు. మహాభారత పాత్ర సైంధవుడు నుండి సైంధవ్ ని తీసుకున్నాడు. వ్యవహారికంలో కూడా ఎవడైనా పనికి అడ్డు తగిలితే… సైంధవుడిలా అడ్డుపడ్డాడని అనుకుంటాం. పాండవులపై పగతో సైంధవుడు తపస్సు చేసి మహాశివుడు వరం పొందుతాడు. పాండవులను అడ్డగించగలిగే శక్తి సాధిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసిన అభిమన్యుడికి తిరిగి రావడం తెలియదు.
పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని పాండవులు రక్షించకుండా శివుని వరంతో సైంధవుడు అడ్డగిస్తాడు. ఒంటరైన అభిమన్యుడు కౌరవుల చేతిలో హతం అవుతాడు. మరి ఈ నెగిటివ్ రోల్ టైటిల్ రిఫరెన్స్ గా శైలేష్ కొలను ఎందుకు తీసుకొన్నాడనేది ఆసక్తికరం. శత్రువులను, వారిని అన్యాయాలను అడ్డగించే సైంధవుడు అనే అర్థంలో వాడి ఉండొచ్చు. ఫస్ట్ గ్లిమ్స్ సైతం విడుదల చేశారు. ”నేను ఎక్కడికీ వెళ్లనున్నారు ఇక్కడే ఉంటా, రమ్మను” అని వెంకీ గన్ పట్టుకొని డైలాగ్ కొట్టారు.

Venkatesh Saindhav
కెరీర్ బిగినింగ్ లో వెంకీ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేశారు. తర్వాత ఆయన లవ్, ఫ్యామిలీ జోనర్స్ ట్రై చేసి విజయం సాధించారు. స్టార్ హీరోగా రిటైర్ అవుతున్న తరుణంలో ఆయనతో ఇలాంటి సబ్జెక్టు చేయడం సాహసంతో కూడిన వ్యవహారం. ఆ మధ్య షాడో అంటూ వెంకీ చేసిన గ్యాంగ్స్టర్ డ్రామా ఆడలేదు. ఏది ఏమైనా ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాకు కావలసినంత ప్రచారం తెచ్చిపెట్టాయి. వెంకీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ బోయినపల్లి ఈ మూవీ నిర్మిస్తున్నారు.