‘సైనా’ టీజర్ టాక్: నంబర్ 1గా ఇలా ఎదిగింది

హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై తీసిన బయోపిక్ ‘సైనా’. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రంలో పరిణీతి చోప్రా ‘సైనా’ పాత్రను పోషిస్తోంది. అమోల్ గుప్తే దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మాణ సంస్థ నిర్మించింది. తాజాగా ‘సైనా’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో చిన్నప్పుడే ‘సైనా’ ఎలా బ్యాడ్మింటన్ నేర్చుకుంది.? ఎలా చాంపియన్ గా ఎదిగింది? ఉత్కంఠగా ఉద్విగ్న […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
‘సైనా’ టీజర్ టాక్: నంబర్ 1గా ఇలా ఎదిగింది

హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై తీసిన బయోపిక్ ‘సైనా’. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రంలో పరిణీతి చోప్రా ‘సైనా’ పాత్రను పోషిస్తోంది. అమోల్ గుప్తే దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మాణ సంస్థ నిర్మించింది.

తాజాగా ‘సైనా’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో చిన్నప్పుడే ‘సైనా’ ఎలా బ్యాడ్మింటన్ నేర్చుకుంది.? ఎలా చాంపియన్ గా ఎదిగింది? ఉత్కంఠగా ఉద్విగ్న క్షణాలను చూపిస్తూ కమర్షియల్ పంథాలో ఈ చిత్రాన్ని తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్తమవుతోంది.

పరిణీతిచోప్రా అచ్చం సైనాలాగానే ఇందులో నటించింది. దీనికోసం ఆమె బ్యాడ్మింటన్ కూడా నేర్చుకోవడం విశేషం. సైనా హావభావాలు, ఎమోషన్, ఇంట్లో ఒత్తిళ్లను పరిణీతి బాగా చూపించింది.

భారతదేశపు నంబర్ బ్యాడ్మింటన్ స్టార్ గా సైనా ఎలా ఎదిగింది? దీనికోసం ఎంత శ్రమించారో తెరపై చూపించారు. బాల్యంలో అమ్మాయిల మాదిరి కాకుండా ఎలా ఈ మార్గాన్ని ఎంచుకున్నారో కూడా టీజర్ లో చూపించారు. ప్రపంచ నంబర్ 1 గా నిలిచిన ఏకైక భారతీయ మహిళా బ్యాడ్మింటన్ స్టార్ గా ఎదగడం వెనుక మొత్తం ఈ టీజర్ లో చూపించారు. మార్చి 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Most popular News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు