Saidharam Tej parents : సాయిధరమ్ తేజ్ తల్లితండ్రుల మధ్య ఆ చిచ్చు.. విడిపోవడానికి కారణం అదేనా!

పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండేవారు కానీ, ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో అయ్యాడో, అప్పటి నుండి చిరంజీవి కుటుంబంతో పంజా ప్రసాద్ కి ఈగో క్లాష్ వచ్చిందట.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Saidharam Tej parents : సాయిధరమ్ తేజ్ తల్లితండ్రుల మధ్య ఆ చిచ్చు.. విడిపోవడానికి కారణం అదేనా!

Saidharam Tej parents : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలందరూ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన చిరంజీవి కుటుంబం మొత్తానికి ఒక దారి చూపించాడు.అయితే దారి చూపించడం వరకే ఆయన పని, మిగతాదంతా వాళ్ళ సొంత కష్టం మీద నేర్చుకోవాల్సిందే, చిరంజీవి క్రమ శిక్షణ , పట్టుదల వల్లే ఈ రేంజ్ కి ఎదిగారు. తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదే నేర్పించాడు,అది ఫాలో అవ్వడం వల్లే ఈరోజు అందరూ ఈ స్థానం లో ఉన్నారు.

ఇక చిరంజీవి మేనల్లుడిగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇతని గురించి అందరికీ తెలిసిందే, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ తన సొంత టాలెంట్ తో నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు.మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినా ‘చిత్రలహరి’ నుండి రీసెంట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ వరకు వరుసగా నాలుగు హిట్స్ పడ్డాయి.

ఇది ఇలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న సమయం లోనే సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గకి, పంజా ప్రసాద్ కి వివాహం అయ్యిందట. అప్పట్లో చిరంజీవి కంటే పంజా ప్రసాద్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈయన అంటే తెలియని వాళ్లంటూ ఉండరు.పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండేవారు కానీ, ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో అయ్యాడో, అప్పటి నుండి చిరంజీవి కుటుంబంతో పంజా ప్రసాద్ కి ఈగో క్లాష్ వచ్చిందట. విజయ దుర్గ కూడా చిరంజీవి తరుఫునే నిలబడి మాట్లాడేదట. ఇలా తరుచూ ఇబ్బందులు ఏర్పడడంతో పంజా ప్రసాద్ విడాకులు ఇచ్చేశాడట. ఆ తర్వాత కొన్నాళ్ళకు విజయ దుర్గ ఒక డాక్టరుని పెళ్లాడింది.

పంజా ప్రసాద్ – విజయ దుర్గ తో విడిపోయినా కూడా తన కొడుకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడట. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయ్యినప్పుడు కూడా ఆయన హాస్పిటల్ లోనే ఉండేవాడట. రీసెంట్ గా పంజా ప్రసాద్ కి హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడట. ఈ విధంగా కొడుకులతో మంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్నాడు.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు