Hindi Chhatrapati Closing Collections
Hindi Chhatrapati Closing Collections: పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని పెద్దలు చెప్పిన సామెత మన టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ విషయం లో వర్తిస్తుంది. తెలుగు లో ఎన్నో ఊర మాస్ సినిమాలకు దర్శకత్వం వహించి ఒకానొక దశలో రాజమౌళి తో నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడిన ఈ మాస్ డైరెక్టర్ పరిస్థితి అత్యంత దయనీయం గా మారింది. టాలీవుడ్ లో ఆయనకీ గత కొంతకాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ లేదు.
వీవీ వినాయక్ ఫామ్ ని చూసి స్టార్ హీరోలు కాదు కదా, కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. దీనితో ఆయన ఖాళీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ని పట్టుకొని బాలీవుడ్ కి వెళ్ళాడు. అక్కడ చేసేదేదో కొత్త సినిమా చెయ్యొచ్చు గా, కానీ ఆయన అలా చెయ్యలేదు, తెలుగు లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేసాడు.
మక్కీకి మక్కి ‘ఛత్రపతి’ సినిమాని హిందీ లో దించేసాడు వీవీ వినాయక్.కానీ బాలీవుడ్ ఆడియన్స్ అప్పటికే ఛత్రపతి హిందీ డబ్ వెర్షయిన్ యూట్యూబ్ లో తెగ చూసేసారు. అలాంటి సినిమాని ఆయన రీమేక్ చేసాడు. ఆడియన్స్ ఏమి తింగరోళ్ళు కాదు కదా, సోషల్ మీడియా లేని రోజుల్లో ఇలాంటి రీమేక్స్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చి యూట్యూబ్ మరియు ఓటీటీ యాప్స్ కి జనాలు బాగా అలవాటు పడ్డారో , అప్పటి నుండి ఇలాంటి రీమేక్స్ ని థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఛత్రపతి విషయం లో కూడా అదే జరిగింది. మొదట్లో ఈ సినిమాని మీడియం రేంజ్ బడ్జెట్ లోనే తీద్దాం అనుకున్నారు, కానీ మధ్యలో కరోనా రావడం, లాక్ డౌన్ విధించడం వల్ల, వేసిన సెట్స్ అన్నీ దెబ్బ తిని, నిర్మాతకి భారీ గా ఖర్చు అయ్యింది.
అలా సినిమా బడ్జెట్ తో పాటుగా వేస్ట్ ఖర్చులు కూడా బాగా పెరిగి వంద కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యిందట. ఈ వంద కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాకి క్లోసింగ్ లో 44 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చిందట. వీవీ వినాయక్ లాంటి దర్శకుడికి ఇతర ఇండస్ట్రీ లో ఇలాంటి పరాభవం ఎదురవ్వడం తెలుగు సినిమాకి అవమానకరం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.