Sai Pallavi Surgery: సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి! కారణం తెలుసా?
దర్శకుడు శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ మాత్రం సూపర్ హిట్ కొట్టింది. సాయి పల్లవి సినిమాలకు విరామం ప్రకటించారని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, డాక్టర్ గా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పుకార్లు వినిపించాయి. అయితే మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను, అందుకే విరామం అని ఆమె చెప్పుకొచ్చారు. సాయి పల్లవి అంటే అందరూ తమ ఇంట్లో అమ్మాయిగా భావిస్తారు. నేను చేసే పాత్రలు గొప్పగా ఉండాలి. కథ నచ్చితే ఈ భాషలో అయినా చేస్తానని ఓ సందర్భంలో సాయి పల్లవి వెల్లడించారు.

Sai Pallavi Surgery: కేవలం టాలెంట్ తో ఎదిగిన అరుదైన అమ్మాయి సాయి పల్లవి. ఈ రోజుల్లో కూడా నిబంధనలు పెట్టుకుని రాణిస్తుంది. సాయి పల్లవి మంచి నటి, గొప్ప డాన్సర్. వీటితో పాటు సాయి పల్లవి వ్యక్తిత్వానికి అభిమానులు ఉన్నారు. హీరో ఎవరైనా పాత్ర నచ్చితేనే చేస్తానని నిక్కచ్చిగా చెబుతుంది. రెమ్యునరేషన్ పెద్దగా డిమాండ్ చేయదు. నష్టపోయిన నిర్మాతలకు సాయి పల్లవి డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది.
యూత్ సైతం ఆమెను అభిమానిస్తారు. కాగా సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నారన్న న్యూస్ కోలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సాయి పల్లవి అందం కోసం ఈ సర్జరీ చేయించుకోలేదు. ఆమె కాలికి సర్జరీ జరిగిందట. ఇటీవల సాయి పల్లవి డాన్స్ చేస్తుండగా కాలికి గాయమైందట. దాంతో సర్జరీ అవసరమైందట. చికిత్స అనంతరం కూడా డాన్స్ చేసేటప్పుడు ఆ గాయం బాధిస్తుందని సాయి పల్లవి సన్నిహితులతో చెప్పారట.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నారు. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు ఆడియన్స్ ఆమెను బాగా మిస్ అవుతున్నారు. నిజానికి తెలుగులోనే ఆమెకు ఎక్కువ ఫేమ్ ఉంది. సాయి పల్లవి తెలుగులో చేసిన చివరి చిత్రం విరాటపర్వం. పీరియాడిక్ లవ్ అండ్ రెవల్యూషనరీ డ్రామాగా తెరకెక్కిన విరాటపర్వం అంతగా ఆడలేదు.