డైరెక్టర్ ని బుక్ చేసిన హీరోయిన్ సాయిపల్లవి !

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’కి మొదటి నుండి హీరోయిన్ సమస్యే. పైగా అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోందట. మరి అలాంటి అలిమేలు మంగగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేశారు. తేజ సినిమా కోసం అంతా ఒప్పుకున్నాక సాయిపల్లవి అమాంతం రేటు పెంచేసిందట. ప్రస్తుతం ఈమె సినిమాకు 80 లక్షల రూపాయలకు అటుఇటుగా తీసుకుంటోంది. తేజ సినిమాకు వచ్చేసరికి మాత్రం కోటి […]

  • Written By: Neelambaram
  • Published On:
డైరెక్టర్ ని బుక్ చేసిన హీరోయిన్ సాయిపల్లవి !

Sai Pallavi
టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’కి మొదటి నుండి హీరోయిన్ సమస్యే. పైగా అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోందట. మరి అలాంటి అలిమేలు మంగగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేశారు. తేజ సినిమా కోసం అంతా ఒప్పుకున్నాక సాయిపల్లవి అమాంతం రేటు పెంచేసిందట. ప్రస్తుతం ఈమె సినిమాకు 80 లక్షల రూపాయలకు అటుఇటుగా తీసుకుంటోంది. తేజ సినిమాకు వచ్చేసరికి మాత్రం కోటి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోంది.

Also Read: ‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల !

నిజానికి ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని పరిశీలించారు తేజ. వారిలో ముఖ్యంగా కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని వాళ్ళు అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని తేజ అనుకున్నప్పటకీ.. కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. అనుష్క కూడా వచ్చిన సినిమాలన్నీ అంగీకరించే మూడ్ లో లేదు. అందుకే ఫైనల్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసుకున్నారు.

Also Read: నట వారసుడితో ‘సోషల్ మీడియా బ్యూటీ’ !

ఇక యాక్షన్ హీరో గోపీచంద్‌ కు అసలు కాలం కలిసి రావడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు వస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గోపీచంద్, యాక్షన్ హీరోగా కొనసాగడానికి నానాతిప్పలు పడుతూ.. తన సినీ కెరీర్ లో గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడతా ఉన్నాడు. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా బాగా నిరాశపరచడంతో.. గోపీచంద్ పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. దాంతో నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు