Sai Dharam Tej- NTR: బైక్ యాక్సిడెంట్ తర్వాత చాలా కాలం సినిమాలకు విరామం ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు షూటింగ్స్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు..ఈసారి ఆయన యాక్షన్ మరియు లవ్ స్టోరీ తో కాకుండా థ్రిల్లర్ జానర్ తో మన ముందుకి ‘విరూపాక్ష’ అనే సినిమా ద్వారా రాబోతున్నారు..ఈ చిత్రానికి సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండగా కార్తీ దండు దర్శకత్వం వహిస్తున్నాడు..ఇక భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Sai Dharam Tej- NTR
ఇక ఈ సినిమాకి సంబంధించి మరో విశేషం ఏమిటంటే , ఇది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది..ఈరోజు సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ని విడుదల చేసారు..ఈ టైటిల్ గ్లిమ్స్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ ని అందించారు..ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘తారక్ కి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేసుకోవాలి..2007 వ సంవత్సరం లో నేను మొదటిసారి ఆయనని కలిసినప్పుడు నన్ను ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నాడో..ఇప్పుడు కూడా అదే ప్రేమ తో నన్ను రిసీవ్ చేసుకున్నారు..లవ్ యూ తారక్..నేను అడగగానే ఈ గ్లిమ్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చావు..ఎవరేమి అనుకున్నా నీతో నా స్నేహం బంధం ఎప్పటికి ఇలాగె కొనసాగాలి’ అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Sai Dharam Tej- NTR
సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా బయట హీరోలలో ఆయన ఎంతో అభిమానించేది జూనియర్ ఎన్టీఆర్ ని..ఎన్నో ఇంటర్వూస్ లో ఆయన ఎన్టీఆర్ ని మించిన నటుడు లేడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి..ఆయన హీరో గా నటించిన జవాన్ అనే సినిమా ఓపెనింగ్ కి కూడా సాయి ధరమ్ తేజ్ ని ఎన్టీఆర్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు..అలా వీళ్లిద్దరి మధ్య అనుబంధం చెక్కు చెదరకుండా అలా కొనసాగుతూనే ఉంది.