Currency fallen On Roads: హైదరాబాద్ మహానగరంలో అది ఎప్పుడూ బిజీగా ఉండే మాదాపూర్ రోడ్డు.. ఆ రోడ్డుపై సీరియస్ గా వాహనాల్లో వెళుతున్న జనం ఒక్కసారికి అవాక్కయ్యారు. రూ.2వేల రూపాయల నోట్ల కట్టలు కట్టలుగా రోడ్డుపై దర్శనమిచ్చాయి. జనం వాటిని చూసి షాక్ తిన్నారు. ఆ నోట్ల కట్టలు చేజిక్కించుకునేందుకు పరుగులు తీశారు.
ఫ్రీగా డబ్బులు రోడ్డుపై పడాయనగానే జనం ఎగబడ్డారు. కష్టపడితే అవి కాపాడుకోవచ్చు. కానీ ఇలా ఫ్రీ గా వచ్చాయి కాబట్టి ఎవ్వరూ వదిలిపెట్టకుండా వారి వెంటపడ్డారు.రోడ్లపై రూ.2వేల నోట్లు కనిపిస్తే ఊరుకుంటారా? అసలే ఈ నోట్లకు గిరాకీ ఎక్కువ. అసలు ఎక్కువగా కనిపించడం లేదు కూడా. అందుకే రోడ్డుపై కనిపించగానే జనం ఎగబడ్డారు.
హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని కాకతీయ రోడ్డుపై బుధవారం కట్టలు కట్టలుగా రూ.2వేల నోట్లు ఉండడంతో స్థానికులు,వాహనదారులు ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికిన డబ్బులు వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ డబ్బులు ఏరుకున్న వారంతా కొద్దిసేపటికే షాక్ అయ్యారు.
మాధాపూర్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ సమీపంలో కాకతీయ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. అదే దారిలో వెళ్లే వాహనదారులు వాటిని చూసి వాటి కోసం పరుగులు పెట్టారు. దీంతో ఆ రహదారి బ్లాక్ అయ్యింది. ట్రాఫిక్ జాం ఏర్పడింది. నోట్లను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. చాలా మంది వాటిని తీసుకొని ఇంటికెళ్లిపోయారు. ఈవిషయంలో పోలీసులకు చేరడంతో వారు రంగప్రవేశం చేశారు.
ఇక ఆ రూ.2వేల నోట్లను తీసుకున్న వారు ఆ నోట్లను తదేకంగా చూడగా అవాక్కయ్యారు. రూ.2వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో తీసుకున్న వారు షాక్ అయ్యారు.
నకిలీ కరెన్సీ నోట్లని తెలియక నోట్లను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో కొంత సేపు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నకిలీ రూ.2వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.