Rajasthan 2000 Notes: నోట్ల ఉపసంహరణ వేళ… కట్టల పాములు బయటికి వస్తున్నాయి

2000 నోటు ఉపసంహరణ నిర్ణయం తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By: Bhaskar
  • Published On:
Rajasthan 2000 Notes: నోట్ల ఉపసంహరణ వేళ… కట్టల పాములు బయటికి వస్తున్నాయి

Rajasthan 2000 Notes: ఏ ముహూర్తాన 2000 నోటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెర పైకి తీసుకొచ్చిందో తెలియదు కానీ.. ఆనాటి నుంచి దేశంలో కరెన్సీ వినియోగం మరింతగా పెరిగిపోయింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్ద ఫలితం ప్రయోజనం చేకూర్చని ఆపరేషన్ లాగా మిగిలిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 నుంచి 2000 నోటును సర్కులేషన్ లో ఉంచడం తగ్గించేసింది. మొన్న ఇందుకు సంబంధించి 2000 నోటును ఉపసంహరించుకున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. దీనివల్ల నల్లధనం నియంత్రణ సాధ్యమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంటున్నది. ఇది కార్యరూపం దాల్చుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం నల్లధనం కట్టడి సాధ్యమే అని నిరూపిస్తున్నాయి.

ఫేక్ కరెన్సీ పట్టివేత

2000 నోటు ఉపసంహరణ నిర్ణయం తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు ముద్రించి పంపిణీ చేస్తున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం సాయంత్రం నగర శివారులోని దహి సర్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల నుంచి 2000 నోట్లు కలిగిన 250 బండిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ వ్యక్తులు మరో ముగ్గురు వివరాలు చెప్పారు. ఆ నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ముంబై నగరంలోని ఆందేరిలో ఒక హోటల్ పై దాడి చేశారు. అందులో ఉన్న మిగతా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుంచి రెండు కోట్ల నగదు ( అన్ని కూడా రెండు వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్, ఏడు ఫోన్లు, రూ.28,170 నిజమైన కరెన్సీ, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరంతా కూడా అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యులని తేలిందని మహారాష్ట్ర డిసిపి సంగ్రామ్ సింగ్ నిషాంధర్ తెలిపారు.

రాజస్థాన్లో ప్రభుత్వ కార్యాలయంలో

ఇక ముంబైలో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల ఘటనను మర్చిపోకముందే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో 2.13 కోట్ల నగదును అది కూడా మొత్తం 2000 నోట్ల డి నామినేషన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తో పాటు బంగారు బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది.

2000, 500 నోట్లు

ఈ ఆపరేషన్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న కరెన్సీలో 2000, 500 నోట్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించడం విశేషం. అయితే మే 19న 2000 నోటు పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయంలో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పోలీసుల కళ్ళు చెదిరిపోయేలాగా బంగారం, లభించింది. జైపూర్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయం గదిలో ఉన్న కబ్ బోర్డు లో ఓ బ్యాగును గుర్తించి దాన్ని ఓపెన్ చేశారు. అందులో మొత్తం నోట్ల కట్టలు ఉండడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అయింది.. నగదు తో పాటు బంగారు బిస్కెట్లు ఉండటం కూడా పోలీసులను మరింత షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంగా ఆ బ్యాగులో 2.31 కోట్ల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన ఆ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం రాత్రికి ఈ స్థాయిలో ఫేక్, అసలు కరెన్సీ లభించడం కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 30 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఎన్ని కట్టల పాములు బయటపడతాయోనని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు