
అయితే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ గ్లింప్స్ విడుదల తేదీని చిత్ర బృందం ఇటీవలే ఖరారు చేసింది. 45 సెకండ్ల పాటు ఉండే వీడియో గ్లింప్స్ ను నవంబర్ 1 వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. దాంతో చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న ఎలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.