
మన అందరం #RRR చిత్రానికి ఆస్కార్ వచింది కదా, ఆ చిత్రానికి సంబంధించిన అందరూ ఉచితంగా లోపలకు అడుగుపెట్టారు అని అనుకున్నాం.కానీ ఆస్కార్ ఈవెంట్ లోకి అడుగుపెట్టడానికి కచ్చితంగా టికెట్ కొనాల్సిందే అట.కేవలం నోమిమ్మేషన్స్ ఉన్న పోటీదారులు మాత్రమే ఫ్రీ ఎంట్రీ.మిగిలిన వాళ్ళు కచ్చితంగా టికెట్ కొనుగోలు చేసే లోపలకు రావాలంట.ఒక్కో టికెట్ ధర 25 వేల డాలర్లు.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 20 లక్షల రూపాయిలు అన్నమాట.రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు రాజమౌళి ఒక్కొక్కరు 25 వేల రూపాయిలను పెట్టి టికెట్ కొనుగోలు చేసి లోపలకు వచ్చారట.
అంటే కేవలం టికెట్స్ కోసం ఈ ముగ్గురు చేసిన ఖర్చు 60 లక్షల రూపాయిలు అన్నమాట.ఇక వీరితో పాటు రాజమౌళి కొడుకు కార్తికేయ, భార్య రమ, రామ్ చరణ్ భార్య ఉపాసన, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ మరియు కాళ భైరవ వీళ్ళందరికీ కలిపి కోటి రూపాయిలు.
మొత్తం మీద టీం మొత్తానికి కలిపి కోటి 60 లక్షలు రూపాయిలు ఖర్చు చేస్తే లోపలకు ఎంట్రీ వచ్చింది అన్నమాట.దీనిని బట్టీ అమెరికా లో ఆస్కార్ క్యాంపైన్స్ తో కలిపి మూవీ టీం కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో ఊహించుకోవచ్చు.ఒకవేళ ఆస్కార్ అవార్డు రాకపొయ్యుంటే హీరోల విలువమైన సమయం తో పాటు బోలెడంత డబ్బు వృధా అయ్యుండేది.